క్రైమ్/లీగల్

పోలీసుల అదుపులో దళ కమాండర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూసుమంచి, జూన్ 9: కూసుమంచి మండలం చౌటపల్లి శివారు బండమీది తండాలో శనివారం తెల్లవారుజామున గుండాల ఏరియా దళ కమాండర్ బోడ భీముడు అలియాస్ సుధాకరన్నను పార్టీ సానుభూతి పరుడైన మచ్చు నాయక్ ఇంట్లో ఉండగా పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం తెల్లవారుఝామున మచ్చు నాయక్ ఇంటిని చుట్టుముట్టి భీముడుతో పాటు మచ్చునాయక్‌ను కూడా అదుపులోకి తీసుకుని కూసుమంచి స్టేషన్‌కు తరలించారు. గుండాల ప్రాంతానికి చెందిన భీముడు గత 20 సంవత్సరాలుగా పార్టీ సానుభూతిపరుడుగా ఉంటూ గత మూడేళ్ళగా ఆ ఏరియా దళ కమాండర్ గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన చికిత్స కోసం మైదాన ప్రాంతమైన చౌటపల్లిలో ఉంచారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో చంద్రన్న వర్గం సానుభూతి పరులుండటం వల్ల ఇక్కడ గత రెండు రోజులుగా పార్టీ సానుభూతి పరుడైన భూక్యా మచ్చు నాయక్ ఇంట్లో పసరు వైద్యం పొందుతున్నాడని, ఖమ్మం ఆసుపత్రి కి వెళ్ళేందుకు కూడా ఎర్పాటు చేసుకున్నాడని సమాచారం. భీముడు ఇప్పటికే ఒకసారి చికిత్స పొంది వెళ్ళాడని, మరల ఒకసారి చికిత్సకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత మూడు రోజులుగా పోలీసులు నిఘా వేసి, ఇన్‌పార్మర్ సహయంతో అర్దరాత్రి అదుపులోకి తీసుకున్నారు. భీముడి అరెస్ట్‌తో ఉలిక్కిపడ్డ పార్టీ వర్గాలు మాత్రం భీముడు వైద్యం చేయించుకోవడానికి మాత్రమే వచ్చాడని అతనిని నిర్భందించిన పోలీసులు ఎటువంటి హాని తలపెట్టకుండా కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్ చేశారు.