క్రైమ్/లీగల్

కారును ఢీకొట్టి డివైడర్‌పైకి.. టిప్పర్ బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూన్ 9: మేడ్చల్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో అంతే వేగంతో వెనుక వస్తున్న టీప్పర్ లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టి కొద్ది దూరం అలాగే లాక్కును వెళ్లి డీవైడర్ పైకి ఎక్కి మధ్యలో ఆగిపోయింది. వివరాల ప్రకారం.. పట్టణంలోని 44వ జాతీయ రహదారి ముకుంద్ సీనీమాహాల్ ఎదురుగా శనివారం మధ్యాహ్నం అత్వెల్లి వైపు నుంచి మేడ్చల్ వైపునకు వస్తున్న టీప్పర్ ముందు వెళ్తున్న కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో అదుపు తప్పిన టీప్పర్ లారీ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టి కొద్ది దూరం కారును లాక్కువెళ్లి డీవైడర్ ఎక్కి మధ్యలో నిలిచిపోయింది. టీప్పర్ లారీ వేగంగా కారును ఢీకొట్టడంతో కారు మూడు పల్టీలు కొట్టి రోడ్డుపై నిలిచిపోయింది. ప్రమాద సమయంలో రోడ్డుపై పెద్దగా వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. కారులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం కారణంగా హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డీవైడర్ పైకెక్కిన టీప్పర్ లారీని క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.