క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిడమనూరు, జూన్ 9: మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో సుంకరి ఈదయ్య(48) అనే రైతు అప్పుల బాధ తాళ్లలేక శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం ఈదయ్యకు వ్యవసాయంలో సుమారు 10 లక్షల రూపాయల వరకు అప్పులు కావడంతో వాటిని తీర్చే స్తోమత లేక శనివారం తెల్లవారు జామున పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడున్నారు. మృతుని భార్య సుంకరి మంగమ్మ ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టు మార్టంకై నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిడమనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
బాలుడి మృతదేహం లభ్యం
నాగార్జునసాగర్, జూన్ 9: సాగర్ విజయపురి సౌత్ రైట్ బ్యాంక్ లాంచ్ స్టేషన్ సమీపంలో కృష్ణవేణి ఘాట్ వద్ద కృష్ణా నదీ తీరాన శనివారం మద్యాహ్నం బాలుడి మృతదేహం కనిపించడంతో మత్స్యకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో కావాలనే బాలుడిని నదిలో పడేసి వెళ్లినట్టు తెలుస్తుంది. విజయపురి సౌత్ పోలీస్ ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాన్ని సాగర్ కమలానెహ్రూ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తనను సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.