క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, జూన్ 9: మండలంలోని మంగ్లూర్ శివారులోని పొలంలో విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి చెందాడు. ఎస్‌ఐ ఉపేందర్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా.. పిట్లం మండలం అల్లాపూర్ గ్రామనికి చెందిన గైని కాడి గోవింద్‌రావు(45) అనే కౌలు రైతు మంగ్లూర్ గ్రామానికి చెందిన గొర్రెకృష్ణారెడ్డి పొలంను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడన్నారు. పక్కనే పొలంలో తుకం పోసి దాని చుట్టు జీఏ వైరును చుట్టి విద్యుత్ సరఫరా చేశారు. ఉదయం 5 గంటల సమయంలో పొలం దునే్నందుకు ట్రాక్టర్ తీసుకుని పొలంలోకి వెళ్లగా పక్కనే ఉన్న జనార్ధన్ పొలంలో తుకం వద్ద విద్యుత్ వైర్లు తగిలిన గేదెను రక్షించే ప్రయత్నంలో కరెంట్ కనెక్షన్ తీసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు గోవిందురావు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మి, నిఖిత, పూజ, దీపక్ ముగ్గురు సంతానం ఉన్నారని, పెద్దకూతురు వివాహం జరిగిందన్నారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, శవాన్ని బాన్స్‌వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.