క్రైమ్/లీగల్

తిమ్మక్క చెరువులో మునిగి యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటాన్‌చెరు, జూన్ 9: పట్టణ శివారులలోని తిమ్మక్క చెరువులో మునిగి యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. పట్టణంలోని సాయిరాం నగర్ కాలనీలో నివాసం ఉంటున్న కార్తిక్‌గౌడ్(18) చందానగర్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరము చదువుతున్నాడు. అతని తండ్రి యాదగిరి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా కార్తిక్‌కు గత కొన్ని సంవత్సరాలుగా మతి స్థిమితం లేదు. హైద్రాబాద్‌లోని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చికిత్స సైతం పొందుతున్నాడు. శనివారం మధ్యా హ్నం ఇంటి బయటికి వెళ్లిన కార్తిక్ గౌడ్ తిమ్మక్క చెరువులో మునిగి శవంగా కనిపించాడు. మతి స్థిమితం సరిగా లేక పోవడంతో అతనే నీటిలో మునిగి చనిపోయాడని పోలీసులు తెలియ చేస్తున్నారు. పటన్‌చెరు ఎస్‌ఐ కిష్టారెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ఏరియా అసుపత్రికి తరలించారు. తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు అయినట్లు ఎస్‌ఐ కిష్టారెడ్డి తెలిపారు.