క్రైమ్/లీగల్

మూర్చవ్యాధితో ఆర్టీసీ బస్సులో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కణేకల్లు, జూన్ 10 : రాయదుర్గం నుంచి ఉరవకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో రాయదుర్గంకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ ఖలీల్ (60) ఆదివారం మూర్చవ్యాధితో మృతి చెందాడు. డ్రైవర్ దస్తగిరి తెలిపిన వివరాల మేరకు మృతుడు ఖలీల్ రాయదుర్గం నుంచి ఉరవకొండలో తన కూతురు ఇంటికి బస్సులో వెళ్తుండగా కణేకల్లు శ్రీచిక్కణేశ్వర వడియార్ చేరువుకు సమీపంలోకు రాగానే మూర్చవ్యాధి వచ్చింది. అయితే వెంటనే చేతిలో తాళాల గుత్తి, ఇనుపరాడ్ ఉంచారు. అనంతరం ఉరవకొండ ఆర్టీసీ మేనేజర్‌కు సమాచారం అందించగా కణేకల్లు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని అధికారులు సలహా ఇచ్చారు. దీంతో బస్సును కణేకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు నాగభూషణం పరిశీలించినట్లు ఖలీల్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు రాయదుర్గం నుండి కణేకల్లుకు వచ్చి బోరున విలపించారు.
వ్యక్తి ఆత్మహత్య
ఉరవకొండ, జూన్ 10 : మండలంలోని ఆమిద్యాల గ్రామంలో బోయ ఎర్రిస్వామి (30) ఆదివారం పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఎర్రిస్వామి జీవనోపాధి కోసం జేసీబీ కొనుగోలు చేశాడు. దీంతో సుమారు రూ.10లక్షల అప్పులు చేశాడు. ఈనేపథ్యంలో అప్పుల బాధ తాళలేక జీవితంపై విరక్తి చెంది ఎర్రిస్వామి తోటలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమణించిన బంధువులు ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బస్సు ఢీకొని వ్యక్తి మృతి
సోమందేపల్లి, జూన్ 10 : మండల పరిధిలోని తుంగోడు క్రాస్ వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు ఢీకొని రమేష్ (35) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తుంగోడు క్రాస్ వద్ద రమేష్ రోడ్డు దాటుతున్న సమయంలో హిందూపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రగాయాలకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం బెంగళూరు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య కోమల, ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి ఆత్మహత్య
పెద్దవడుగూరు, జూన్ 10 : మండల పరిధిలోని అప్పేచర్ల గ్రామానికి చెందిన రాజశేఖర్ నాయుడు (62) ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో బంధువులు నిద్రిస్తున్న సమయంలో విషపు గుళికలు తిని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని కుంటుంబీకులు గుత్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందాడు. మృతుని భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సమస్యలకు మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేష్‌రెడ్డి తెలిపారు.