క్రైమ్/లీగల్

హోం గార్డు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, జూన్ 10: భార్య కాపురానికి రాలేదని మనస్తాపానికి గురై పురుగు మందు సేవించి ఆత్మాహత్యా యత్నానికి పాల్పడిన హోంగార్డు వైనం ఇది. మండంలో చికిలింత గ్రామంలో జనుమూరి దారబాబు తన అత్తవారి ఇంటి వద్ద ఆదివారం సాయంత్రం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు 108లో అతనిని జడ్డంగి పీహెచ్‌సీకి తరలించగా వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేసి అడ్డతీగల ఆసుపత్రికి రిఫర్ చేశారు. కాగా దారబాబు స్వగ్రామం విశాఖ జిల్లా కొయ్యూరు మండలం భీమవరం కాగా, అతను విశాఖ జిల్లా గొలుగొండ పోలీస్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య వివాదాలు చోటుచేసుకోడంతో భార్య అలిగి తన అమ్మగారింటికి కొద్దిరోజుల క్రితం వెళ్లింది. ఆదివారం దారబాబు చికిలింత అత్తవారింటికి వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు.