క్రైమ్/లీగల్

అగ్రిగోల్డ్ డైరెక్టర్లకు బెయిల్ మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 12: అగ్రిగోల్డ్ కేసులో సీఐడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలం కావటంతో ఆ సంస్థకు చెందిన ఆరుగురు డైరెక్టర్లకు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చిలకలపూడి, జగ్గయ్యపేట పోలీసు స్టేషన్‌లలో నమోదైన కేసులకు సంబంధించిన సీఐడీ అధికారులు అగ్రిగోల్డ్ సంస్థ డైరెక్టర్లు అయిన అవ్వా వెంకటేశ్వరరావు, అవ్వా హేమ సుందర వర ప్రసాద్, అవ్వా వెంకట శేష నాగేంద్రరావు, అవ్వా వెంకట సత్య వెంకటేశ్వరరావు, అవ్వా విజయ భాస్కర్‌లను అరెస్టు చేసి గత రెండు నెలల క్రితం కృష్ణా జిల్లా ప్రధాన న్యాయస్థానంలో హాజపర్చారు. ఆ సమయంలో నిందితులకు రిమాండ్ విధించటంతో వారంతా ఏలూరు సబ్ జైలులో ఉన్నారు. అరెస్టు చేసిన తర్వాత 60 రోజులు పూర్తయినా సీఐడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేయకపోవటంతో సంస్థ డైరెక్టర్లకు బెయిల్ మంజూరు చేస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీరిపై మరికొన్ని ప్రాంతాల్లో కేసులు ఉండటంతో నిందితులు సబ్ జైలులోనే ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం.