క్రైమ్/లీగల్

ఎస్‌బీఐ క్యాషియర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 12: బ్యాంకులోని ఖాతాదారుల డబ్బులు, బంగారు నగలు కాజేసిన కడప జిల్లా పోరుమామిళ్ల ఎస్‌బీఐ క్యాషియర్ గురుమోహన్‌రెడ్డిని కడప పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరించిన సురేష్‌రెడ్డి, కుమార్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.56.72 లక్షల నగదు, 1.785 కిలోల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కడపలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఏఏస్పీ అద్నాన్ నరుూం అస్మీ నిందితుల వివరాలు వెల్లడించారు. కడప జిల్లా
పోరుమామిళ్ల రంగసముద్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో క్యాష్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న గురుమోహన్‌రెడ్డి ఇటీవల బ్యాంకు నుంచి నగదు, బంగారం నగలు ఎత్తుకెళ్లాడన్నారు. దీనిపై పోరుమామిళ్లలో కేసు నమోదైందన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు మంగవారం గురుమోహన్‌రెడ్డితో పాటు అతనికి ఆశ్రయం ఇచ్చిన భూమిరెడ్డి సురేష్‌రెడ్డి, ముండ్లపల్లి కుమార్‌ను కూడా అరెస్టు చేశామన్నారు. గురుమోహన్‌రెడ్డి క్యాష్ ఇన్‌చార్జిగా పనిచేస్తూ గోల్డ్‌లోన్స్, ఏటీఎంల నిర్వహణను చూసుకునేవాడన్నారు. ఏటీఎంలలో డబ్బులు పెట్టెటప్పుడు, అందులో నుండి కొంత తీసుకునేవాడన్నారు. అదే విధంగా బంగారు ఆభరణాలు తనఖా పెట్టేందుకు వచ్చిన ఖాతాదారులను మోసగించేవాడన్నారు. అసలు నగల స్థానంలో నకిలీవి పెట్టేవాడన్నారు. తస్కరించిన నగలను ప్రొద్దుటూరులోని ఐఐఎఫ్‌ఎల్ గోల్డ్‌లోన్ బ్యాంకులో తనఖాపెట్టి డబ్బు తెచ్చుకునేవాడన్నారు. ఇలా మోసంతో సంపాదించిన డబ్బులను తన భార్య మంజులత పేరుతో తాను పనిచేస్తున్న బ్యాంకులో ఉన్న ఖాతా నుండి ప్రొద్దుటూరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఖాతాకు బదిలీ చేసేవాడన్నారు. ఆ ఖాతా ద్వారా జరోధా షేర్ మార్కెట్ కంపెనీలో పెట్టుబడిగా పెట్టేవాడన్నారు. మార్చి 28న తాను పనిచేస్తున్న బ్యాంకు నుంచి రూ.91 లక్షలు తీసుకుని భార్యతో కలిపి పారిపోయి తన మిత్రులైన భూమిరెడ్డి సురేష్‌రెడ్డి, ముండ్లపల్లి కుమార్ వద్ద ఆశ్రయం పొందాడన్నారు. వారికి తాను తెచ్చిన డబ్బులో కొంత ఇచ్చి ఆ తర్వాత చెన్నైకి మకాం మార్చాడాని ఏఎస్పీ వివరించారు.
గురుమోహన్‌రెడ్డి పోరుమామిళ్ల నుండి నగదుతో పారిపోయిన రోజే ఈవిషయం బయటకు పొక్కడంతో ఖాతాదారులు బ్యాంకును ముట్టడించి ఆందోళన చేశారన్నారు. దీంతో గురుమోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అతని కోసం గాలించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఖాతాదారులను మోసం చేసిన గురుమోహన్‌రెడ్డి, అతనికి ఆశ్రయం ఇచ్చిన సురేష్‌రెడ్డి, కుమార్‌ను మంగళవారం అరెస్టుచేశామన్నారు. వీరి నుంచి రూ. 56.76 లక్షల నగదు, ప్రొద్దుటూరు ఐఐఎఫ్‌ఎల్ బ్యాంకులో తనఖా పెట్టిన 1.718 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తనఖా పెట్టిన ఆభరణాల విలువ రూ.51.54 లక్షలని అన్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు, బంగారు నగల విలువ రూ.1.80 కోట్లని వివరించారు. ఈ కేసును మైదుకూరు డీఎస్పీ బీఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల సీఐ బి.మధుసూధన్‌గౌడ్, ఎస్‌ఐ పెద్దన్న, బి.కోడూరు ఎస్‌ఐ ఘనమద్దులేటి దర్యాప్తు చేశారని ఏఎస్పీ తెలిపారు.