క్రైమ్/లీగల్

పట్టపగలు భారీ దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూన్ 14: రాష్ట్ర రాజధాని అమరావతి నగర పరిధిలోని పెనుమాక గ్రామంలో గురువారం పట్టపగలు రైతు మేకా వేమారెడ్డి నివాసంలో గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. సుమారు కోటిన్నర రూపాయల నగదు, నగలు దోచుకుపోయారు. వేమారెడ్డి, ఆయన కుమారుడు బ్రహ్మారెడ్డి పొలానికి వెళ్లగా, ఇంట్లో వేమారెడ్డి భార్య శివపార్వతి, కోడలు శ్యామల ఉన్న సమయంలో ఈ దోపిడీ జరిగింది. ఉదయం 10గంటల సమయంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ముఖాలకు గుడ్డలు కట్టుకుని ఇంట్లోకి ప్రవేశించారు. అత్తా కోడలిపై దాడి చేసి, వారిని తాళ్లతో బంధించారు. అరిస్తే చంపేస్తామని హెచ్చరించారు. బీరువా తాళాలు తీసుకొని కోటీ 20 లక్షల నగదు నిల్వ ఉంచిన ఒక బ్యాగ్‌ను, సుమారు 20 సవర్ల బంగారాన్ని దోచుకున్నారు. తాము వచ్చిన మోటారు బైక్ పైనే ముగ్గురూ ఎర్రబాలెం వైపు పరారయ్యారు. కొద్దిసేపటి తరువాత అత్తా కోడళ్లు ఇంట్లో నుంచి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు చేరాక దోపిడీ జరిగిన విషయం వెలుగుచూసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసముండే ఉండవల్లి గ్రామానికి సమీపంలోనే పెనుమాక ఉంటుంది. గ్రామంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలు గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడటం సంచలనం కలిగించింది. గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ విజయారావు, డీఎస్పీ జీ రామకృష్ణ, సీసీఎస్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు జాగిలాలను రప్పించి నేరస్థలంలో తిప్పారు. గ్రామంలోని బ్యాంకు వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు అర్బన్ ఎస్పీ విజయారావు తెలిపారు. దొంగలు 80 సవర్ల వరకు బంగారం దోచుకెళ్లి ఉంటారని బాధితులు చెబుతున్నారు.