క్రైమ్/లీగల్

ఎమ్మెల్యేల అనర్హత కేసులో ట్విస్ట్ !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 14: తమిళనాడులో 18మంది ఏఐడిఎంకె ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ పి.్ధన్‌పాల్ తీసుకున్న నిర్ణయంపై మద్రాస్ హైకోర్టు పరస్పర విరుద్ధ తీర్పులను ఇచ్చింది. స్పీకర్ నిర్ణయం సమర్థనీయమేనని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ పేర్కొనగా, దీనిని మరో జడ్జి ఎం.సుందర్ విభేదించారు. తుది తీర్పు నిమిత్తం కేసును మరో బెంచ్‌కు పంపాలని నిర్ణయించారు. 2016లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండాకుల గుర్తుపై పోటీచేసిన ఏఐడీఎంకే స్పీకర్ కాకుండా 116 మంది ఎమ్మెల్యేలను గెల్చుకుంది. అనంతరం పార్టీ అధినేత జయలలిత మరణం తర్వాత పార్టీలో నాయకత్వం కో సం పోటీ ఏర్పడింది. తాను ముఖ్యమంత్రి కావాలని జయలలిత నెచ్చెలి శశికళ భావించగా, దానిని పన్నీరుసెల్వం వ్యతిరేకించారు. దీంతో పార్టీ రెం డుగా చీలింది. అదే సమయంలో శశికళపై ఉన్న కేసుల్లో ఆరోపణలు రుజువు కావడంతో ఆమె జైలుకు వెళ్లింది. వెళ్తూవెళ్తూ పళనిస్వామిని తమిళనాడు సీఎం కుర్చీపై కూర్చోబెట్టింది. ఆయనకు శశికళ మేనల్లుడు దినకరన్ మద్దతు ఇచ్చారు. అనంతర పరిణామాల్లో పన్నీరుసెల్వం డిప్యూటీ సీఎం అయ్యారు. ఇద్దరూ కలిసి దినకరన్ వర్గాన్ని దూ రంపెట్టారు. జయలలిత మరణంతో ఏర్పడిన ఆర్‌కె నగర్‌లో దినకరన్ ఎమ్మెల్యేగా గెలిచారు. పళనిస్వామికి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ లేదని, అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ దినకరన్, అతని వర్గం గవర్నర్‌ను కలిసారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన బలపరీక్షలో పార్టీ మారిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. పార్టీ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న దినకరన్‌ను తొలగిస్తూ పళని, పన్నీరు నేతృత్వం లో పార్టీ నిర్ణయం తీసుకుంది. 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటువేయడాన్ని సవాల్ చేస్తూ దినకరన్ వర్గం కోర్టులో సవాల్ చేసింది. దీనిపై గురువారం పరస్పర విరుద్ధ తీర్పు వెలువడటంతో కేసును మరో బెంచ్‌కు పంపారు. ఒకవేళ 18 మంది అనర్హత నిర్ణయాన్ని కోర్టు కనుక సమర్థిస్తే ఆ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న టీటీవీ దినకరన్