క్రైమ్/లీగల్

ఢిల్లీ ఎయిర్ పోర్టులో బంగారం స్మగ్లర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: ఢిల్లీ ఎయిర్ పోర్టులో గత మూడు రోజుల్లో 14 మంది విదేశీయుల నుంచి రూ.8కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఆరుగురు చైనీయులు, ఇరాన్ దేశస్థుడు ఒకరు, ఐదుగురు అజర్‌బైజాన్‌కు చెందినవారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మధ్యకాలంలో ఇంత పెద్దమొత్తంలో స్మంగ్లింగ్ బంగారం పట్టుబడడం ఇదే మొదటిసారని కస్టమ్స్ జాయింట్ కమిషనర్ అనుభా సిన్హా తెలిపారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు చైనీయులను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు వారి వద్ద ఆరు కిలోల బంగారం ఉన్నట్లు గుర్తించామని అన్నారు. దీని విలువ రూ1.8కోట్లు ఉంటుందని, ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారని వివరించారు.
అలాగే మంగళవారం దుబాయ్ నుంచి వచ్చిన ఒక ఇరాన్ దేశస్థుడి నుంచి ఎనిమిది కిలోల బంగారాన్ని రికవరీ చేశామన్నారు. అజర్‌బైజాన్ నుంచి వచ్చిన వారినుంచి 2.45 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారని వివరించారు.