క్రైమ్/లీగల్

లంకేష్ హంతకుడు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 15: ప్రముఖ జర్నలిస్టు గౌరి లంకేష్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన పరశురామ్ వాఘమేర్‌ను అరెస్ట్ చేసినట్టు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) వెల్లడించింది. పేరు వెల్లడించడానికి ఇష్టపడని సిట్ ఉన్నత అధికారి తెలిపిన వివరాల ప్రకారం గౌరీలంకేష్‌ను చంపడానికి ఉపయోగించిన ఆయుధానే్న గతంలో హేతువాది గోవింద్ పనసారే, ఎంఎం కాల్‌బుర్గి హత్యకు సైతం ఉపయోగించినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. ఫోరెన్సిక్ నివేదిక ఈ విషయాన్ని తేటతెల్లం చేసిందన్నారు. వాఘమేర్ ఈ దురాగతానికి పాల్పడ్డాడని చెప్పారు. అయితే హత్యకు ఉపయోగించిన గన్ ఇంతవరకు దొరకలేదన్నారు. గత ఏడాది సెప్టెంబర్ ఐదున జర్నలిస్టు గౌరీలంకేష్‌ను బెంగళూరులోని ఆమె నివాసం ముందు కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. హిందుత్వ హక్కుల భావాలతో 60 మంది సభ్యులున్న గ్రూప్ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నామన్నారు. దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఈ గ్రూపు సభ్యులు ఉన్నారని, ఈ గ్రూపునకు పేరు లేదని చెప్పారు. సుజిత్‌కుమార్ అలియాస్ ప్రవీణ్ ఈ గ్రూప్ సభ్యులను నియమిస్తాడని తెలిపారు.
ఈ గ్రూప్‌నకు ఎంపీ, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్నాటకలో మంచి నెట్‌వర్క్ ఉందని అన్నారు. అయితే యూపీ రాష్ట్రంతో ఈ గ్రూపునకు సంబంధాలున్నట్టు ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. తీవ్ర హిందుత్వ భావాలున్న హిందుత్వ జాగృత్వ సమితి, సనాతన సంస్థ వంటి వాటిలో సభ్యులను తమ కార్యకలాపాలకు నియమించుకుంటుందని, అయితే వీరి చర్యలతో ఆ సంస్థలకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవని తెలిపారు. కాగా, ముగ్గురి హత్యలతో తమకు ఎలాంటి ప్రమేయం లేదని ఇప్పటికే ఆ సంస్థలు స్పష్టం చేశాయి. లంకేష్ హత్య కేసులో మరో ముగ్గురి ప్రమేయం ఉండవచ్చునని అనుమానిస్తున్నట్టు సిట్ అధికారి తెలిపారు.