క్రైమ్/లీగల్

హత్య కేసును ఛేదించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాదర్‌ఘాట్, జూన్ 15: చిన్నపాటి వివాదం.. ఓ హత్యకు దారితీసిన సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలను ఇన్‌స్పెక్టర్ పీజీ రెడ్డి తెలిపారు. చాదర్‌ఘాట్ సాయిబాబా గుడి సమీపంలోని ఫంక్షన్ హాళ్లలో దీపక్‌సింగ్ అలియాస్ గోరే (35), చాకలి శివ అలియాస్ కృష్ణ (29), నాగరాజు (25), బక్క శివ పనిచేస్తుండేవారు. ప్రతిరోజు ఏ ఫంక్షన్ హాల్లో ఉచితంగా భోజనం దొరికితే అక్కడే తిని పరిసర ఫుట్‌పాత్‌లపైనే పడుకునేవారు. రెండు నెలల క్రితం సాయిబాబా గుడిలో గురువారం అన్నదానం జరుగుతండగా అక్కడ భోజనం చేసే విషయంలో దీపక్‌సింగ్, చాకలి శివ మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఒకరిపై ఒకరు కక్ష పెంచుకుని, రెండు నెలల క్రితం దీపక్ సింగ్ కత్తితో చాకలి శివను చంపేందుకు ప్రయత్నించాడు. కత్తితో మెడపై కోయడంతో శివ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీపక్‌సింగ్‌ను అంతమొందిస్తే తనకు ప్రాణహాని ఉండదని శివ పథకం పన్నాడు. మద్దతుగా నాగరాజు బక్క శివల సహాయం కోరాడు. ఈనెల 9న దీపక్‌సింగ్ సాయిబాబా గుడి సమీపంలో రాత్రి నిద్రిస్తుండగా చాకలి శివ, నాగరాజు, బక్క శివ కలిసి బండరాళ్లతో మోది దీపక్‌సింగ్‌ను చంపేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు చాకలి శివ, నాగరాజు దూల్‌పేటలో ఉన్నారని తెలుసుకుని శుక్రవారం అరెస్టు చేసారు. మరో నిందితుడు బక్క శివ పరారీలో ఉన్నాడని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. నిందితులపై నగరంలోని వివిధ పోలీసుస్టేషన్‌లలో హత్యలు, దోపిడీ కేసులు, దొంగతనం కేసులు నమోదైనట్లు చెప్పారు.