క్రైమ్/లీగల్

కాపలా ఉన్న కాలనీలోనే చోరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూన్ 15: పగలు వాచ్‌మెన్ డ్యూటీ, రాత్రి పని చేస్తున్న ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్న అసోం రాష్ట్రానికి చెందిన యువకుడిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో నిందితుడి వివరాలను డీసీపీ వెంకటేశ్వర రావు వెల్లడించారు. అసోం రాష్ట్రానికి చెందిన బికూల్ బాణ్య (22) మాదాపూర్‌లోని ఖానామెట్‌లో నివాసముంటూ టీఎస్‌ఎస్‌సీ సెక్యూరిటీ సంస్థలో గార్డుగా పనిచేస్తున్నాడు. ఖానామెట్‌లోని ఫాతిమా గెస్ట్‌హౌస్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ గెస్ట్‌హౌస్‌తోపాటు సమీపంలోని ఇళ్లలో ఏసీలు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలించి విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. ఫాతిమా గెస్ట్‌హౌస్‌లోని ఏసీని దొంగిలించి మాదాపూర్‌లో విక్రయిస్తుండగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారించారు. నిందితుడి నుంచి రూ.2లక్షల విలవచేసే రెండు ఏసీలు, ఐదు టీవీలు, మానిటర్, ప్రొజెక్టర్, స్పోట్స్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. మాదాపూర్ క్రైం డీఐ సైదులుని, క్రైం సిబ్బందిని అభినందించారు. ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావు, డీఎస్‌ఐ వరప్రసాద్ పాల్గొన్నారు.