క్రైమ్/లీగల్

చోరీ కేసులో నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూన్ 15: చదివింది 7వ తరగతే అయితేనేమి అంతర్జాలం ఉపయోగించుకుని చోరీ చేయడంలో ఘనుడు. సంపన్నులు నివాసముండే విలాస్‌ని గూగుల్‌లో ఎంపిక చేసుకుని దొంగతనానికి దిగుతాడు. సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకి పంపించినా నిందితుడిలో ఎలాంటి మార్పురాలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. నిందితుడిని మాదాపూర్ సీసీఎస్, నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.30లక్షల విలువ చేసే బంగరం ఆభరణాలు, డైమండ్ వాచీలను స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ క్రైం డీసీపీ జానకి షర్మిల, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో నిందితుని వివరాలను వెల్లడించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో నివాసముండే మంజులా చంద్రశేఖర్ (31) వ్యసనాలకు అలవాటుపడి డబ్బు కోసం 2009 నుంచి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. డబ్బులు అవసరం పడినప్పుడు హైదరాబాద్ రావడం ఎదో ఒక ఇంట్లో దొంగతనం చేసుకుని వెళ్లిపోయేవాడు. గేటెడ్ కమ్యూనిటీ విల్లాలను గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలించి రాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి ఖరీదైన వస్తువులు, బంగారు ఆభరణాలను దోచుకుని తిరిగి అనంతపురం వెళ్లిపోయేవాడు. 2009లో సైబరాబాద్‌లోని మియాపూర్, నార్సింగ్, దుందిగల్, పేట్ బాషీరాబాద్, కేపీహెచ్‌బీతోపాటు సంగారెడ్డి, ఆర్‌సీపురం పోలీసుస్టేషన్‌లతో పాటు ఏపీలోని నెల్లూరు, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం పోలీసుస్టేషన్‌ల పరిధిలో పలు దొంగతనాలు చేశాడు. ఆదే సమయంలో చంద్రశేఖర్‌పై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపించారు. 2015లో జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత నిందితుడు పాత పద్ధతినే ఎంచుకుని దొంగతనాలు చేయసాగాడు. వైజాగ్‌లోని రుషికొండ ప్రాంతంతో నివాసముడే చక్రినాయుడు ఇంట్లో 16లక్షల విలుచేసే డైమండ్ వాచీని దొంగిలించి తీవ్రసంచనం సృష్టించాడు. కొకాపేట విల్లాస్‌లో చోరీ చేయడానికి ప్రయత్నిస్తుండగా నిందితుడిని మాదాపూర్ సీసీఎస్, నార్సింగ్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీలు తెలిపారు. నిందితుడి నుంచి 30లక్షల విలువచేసే ఏడు తులాల బంగారు ఆభరణాలు, విలువైన నాలుగు వాచీలు, ఎనిమిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరెస్టు చేసిన సమయంలో నిందితుని వద్ద కేజీ గంజాయి కూడా దొరికిందని తెలిపారు. నిందితుడిని పట్టుకున్న మాదాపూర్ సీసీఎస్, నార్సింగ్ పోలీసులను రివార్డుకు సిఫార్సు చేయనున్నట్లు ప్రకించారు. మాదాపూర్ ఏసీపీ శ్యామ్‌ప్రసాద్ రావు, సీసీఎస్ ఏసీపీ నంద్యాల నర్సింహా రెడ్డిని అభినందించారు.