క్రైమ్/లీగల్

ప్రేమ వివాహం.. యువతి కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయగూడ, జూన్ 15: ప్రేమ వివాహం చేసుకున్న యువతిని అపహరించిన ఘటన కుషాయిగూడ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది. ఎస్‌ఐ జి.చంద్రశేఖర్, బాధితులు పోలీసుల కథనం ప్రకారం- కుషాయిగూడ- చక్రీపురంలోని నివసిస్తున్న అరుగుల ఆనంద్ బోర్‌వెల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన పప్పుల రుచితను ప్రేమించి ఇటీవల ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహంపై రుచిత తల్లిదండ్రులు భగ్గుమన్నారు. ఆనంద్ లేని సమయంలో రుచిత తండ్రి శ్రీ్ధర్, తల్లి భవాని, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి ఆనంద్ తల్లి, పెద్దమ్మ యాదమ్మలను కొట్టి రుచితను కారులో తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చక్రీపురం రోడ్డు నెంబర్-1లో కారు చేసిన బీభత్సానికి స్థానికులు ఆందోళన చెందారు. రుచిత భర్త ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపిసి 363 సెక్షన్ ప్రకారం కిడ్నాప్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.