క్రైమ్/లీగల్

మైనర్ బాలికపై హత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, జూన్ 15: మండలంలో బీకేపల్లిలో మైనర్ బాలికపై హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. విశాఖలో మైక్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నిందితుడు ఈకేసును తప్పుదోవ పట్టించడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈకేసులో బాధితురాలు, నిందితుడు ఇద్దరు మైనర్లే కావడం విశేషం. బాలిక తల్లిదండ్రులు లక్ష్మీ, గణేష్, ఐద్వా ప్రతినిధులు సూర్యప్రభ, సీపీ ఐ మండల కన్వీనర్ డేవిడ్ అందజేసిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 10న బీకేపల్లి గ్రామ శివార్లలో గల పాకలో అదే గ్రామానికి చెందిన పైల గోపీ (17), లోకేశ్వరి (13) పీకను చున్నీతో బిగించి హత్యాయత్నంకు పాల్పడ్డాడు. లోకేశ్వరి చనిపోయిందని భావించిన గోపీ గ్రామంలోకి వచ్చి సిమ్మెంట్ బస్తా మీద పడడంతో లోకేశ్వరి తీవ్రంగా గాయపడిందని ప్రచారం చేసాడు. తల్లిదండ్రులు లోకేశ్వరి హుటాహుటినా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. లోకేశ్వరిని పరీక్షించిన డాక్టర్లు లోకేశ్వరి సిమ్మెంట్ బస్తా పడడం వలన గాయపడలేదని నిర్ధాంచి మెరుగైన వైద్య సేవలకై విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని సూచించారు. కేజీహెచ్‌లో చేర్చుకోక పోవడంతో మైక్యూర్ ఆసుపత్రిలో తల్లిదండ్రులు చేర్పించారు. సంఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు . పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి కేసును నమోదు చేయలేదని తల్లిదంఢ్రులు ఆరోపించారు. తన అక్క పద్మినిని వేధిస్తున్నందుకు లోకేశ్వరి గోపీని నిలదీసిందన్నారు. దీనిపై కక్ష కట్టిన గోపీ మరో బాలుడి సహాయంతో లోకేశ్వరిని హత్య చేసేందుకు ప్రయత్నించాడన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ఐద్వా ప్రతినిధులు డిమాండ్ చేసారు.

* ఎస్సై వివరణ
దీనిపై ఎస్సై మధుసూదన మాట్లాడుతూ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నంగా ఈనెల 14 రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. తాము ఏ వర్గానికి అనుకూలంగా వ్యవహరించలేదన్నారు.