క్రైమ్/లీగల్

పోలీసు డ్రైవర్‌పై డీజీపీ కుమార్తె దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జూన్ 16: ఒక పోలీసు డ్రైవర్‌పై అదనపు డీజీపీ సుడేష్ కుమార్ కుమార్తె దాడి చేసిన కేసులో ఆయనను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్మ్‌డ్ పోలీస్ బెటాలియన్ అదనపు డిజిగా ఉన్న కుమార్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. సుడేష్ కుమార్ కుమార్తె స్నిగ్ధ, పోలీసు డ్రైవర్ గవాస్కర్‌పై దాడి చేసి గాయపరిచింది. ఈ విషయమై గవాస్కర్ కుటుంబ సభ్యులు శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో స్నిగ్ధపై పోలీసులు ఐపిసి 294బి, 324 సెక్షన్ల కేసు నమోదు చేశారు. తనను పరుష పదజాలంతో మాట్లాడి మెడపైన, భుజాలపైన మొబైల్ ఫోన్‌తో కొట్టిందని గవాస్కర్ ఫిర్యాదు పత్రంలో పేర్కొంది.