క్రైమ్/లీగల్

మేనమామే కాలయముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/దిల్‌సుఖ్‌నగర్, జూన్ 16:రోజు రోజుకు మానవత్వం మంట గలిసిపోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థంకానీ పరిస్థితులు నెలకొన్నాయి. మానసిక వికలాంగులుగా జన్మిండమే తప్పా. ప్రపంచాన్ని పరిచయం చేసుకోకుండానే పైకి వెళ్లిపోయారు. తమకు రక్షణగా నిలబడాల్సిన వాళ్లే కాలయములయ్యారు. ఇద్దరు చిన్నారులను మేనమామే గొంతు నలిమి హత్య చేశాడు. చిన్నారుల హత్యతో చైతన్యపురి ప్రాంతమంత విషాద చాయలు అలుముకున్నాయి. స్థానికంగా తీవ్ర సంచలనం సృస్టించిన ఈ సంఘటన చైతన్యపురి పోలిస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను శనివారం చైతన్యపురి పోలిస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్‌బినగర్ ఏ.సి.సీ ప్రుత్వీధర్ రావు వెల్లడించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. శ్రీనివాస్‌రెడ్డి వృత్తిరిత్యా రెడ్డీస్ ల్యాబ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. మొదటి సంతానం ఇద్దరు కవల పిల్లలు. వారే విష్ణువర్థన్ రెడ్డి(12), సృజనారెడ్డి(12). వీరు పుట్టుకతోనే మానసిక వికలాంగులు. వీరికి తగిన చికిత్సలు చేయిస్తున్నారు. అయినా వారి ఆరోగ్యం మెరుగు పడటం లేదు. లక్ష్మి తమ్ముడు వరుసకు మేనమామ మల్లికార్జున్ రెడ్డి ఈ చిన్నారుల వల్ల తమ అక్క ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆర్థికంగా కూడ కష్టాలు వస్తున్నాయని భావించాడు. ఎలాగైనా వీరిని హతమార్చాలని ఒ పథకం రచించుకున్నాడు. పథకం ప్రకారమే శుక్రవారం మిర్యాలగూడలో నివాసం ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లాడు. వారితో ముచ్చటించాడు. చిన్నారులను పార్కుకు తీసువెళ్లి ఆడిపిస్తానని, విష్ణువర్థన్‌కు ఈత అంటే చాలా ఇష్టం కదాఅని అక్కడి నుండి తీసుకువచ్చాడు. సాయంత్రం పోయి రాత్రి చీకటి అయినా ఇంకా ఇంటికి చేరుకోలేదు. సోదరి ఫోన్ చేయగా తాము హైదరాబాద్ వచ్చామని చెప్పాడు. చైతన్యపురిలోని సత్యనారాయణపురం తాను అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకువచ్చాడు. మల్లికార్జున్ రెడ్డి వృత్తి రిత్యా కెమికల్ ఇంజనీర్. తన భార్య విడాకులు ఇవ్వడంతో స్నేహితులతో కలసి ఉంటున్నాడు. తన పథకం ప్రకారమే శుక్రవారం రాత్రి మానసిక వికలాంగులైన విష్ణువర్ధన్ రెడ్డి, సృజనారెడ్డిలను తన స్నేహితుడు, రూమ్‌మెట్ వెంకట్ రెడ్డి సహాయంతో గొంతు నలిమి మొఖం మీద దిండుతో ఒత్తి హత్య చేశాడు. హత్యా అనంతరం మృతదేహలను తరలించేందుకు తనకు తెలిసిన కారును అద్దెకు పిలుపించుకున్నాడు. మృత దేహలను కారు డిక్కీలోకి మారుస్తుండగా ఇంటి యజమాని మహేష్‌రెడ్డి చూసి ప్రశ్నించాడు. అందుకు ఈ పిల్లలు మతిస్థిమితం లేక విషం తాగారు సీరియస్‌గా ఉంది వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నామని నమ్మబలికాడు. అనుమానం వచ్చిన మహేష్ రెడ్డి పరిశీలించగా వారు మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశాడు. వీరి మధ్య సంభాషణ జరుగుతండగానే చుట్టుప్రక్కల వారు కూడా లేచారు. మృతదేహలను కారులోకి మార్చుతున్న తతంగమంతా కూడా అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. దీంతో చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలిసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు పోలిసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలు, నిందితుడి వెనుకాల ఎవరెవరు ఉన్నారనే దానితో పాటు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.