క్రైమ్/లీగల్

ఆస్తి కోసం తమ్ముడిని నరికి చంపిన అన్నలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనకల్లు, జూన్ 17: పెద్దలు సంపాదించిన ఆస్తిని పంచుకోవడానికి అన్నదమ్ముల మధ్య చెలరేగిన చిన్నపాటి గొడవలు హత్య దాకా దారితీసాయి. ఆస్తి కోసం అమ్మ కడుపున పుట్టిన తమ్ముని సైతం నరికి చంపిన దారుణం తనకల్లు మండలంలోని బొందలపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. ఆదివారం బొంతలపల్లిలో ఉదయం అందరూ గ్రామంలో పొలం పనుల్లో నిమగ్మమై ఉండగా, రవి (35)ని వారి అన్నదమ్ములు నలుగురు, వారి బిడ్డలు కలసి ఇంటిలోకి చొరబడి కిరాతకంగా రవి చేతులు నరికివేశారు. రవి కాపాడాలంటూ వీధిలోకి పరుగులు పెడుతూ స్థానికులు ఏమి జరిగిందో తెలుసుకునే లోపే నడి వీధిలోనే రవిని అన్నదమ్ములు నరికి చంపివేశారన్నారు. అక్కడ నుండి వారు పారిపోయారు. రవి రక్తపు మడుగులో కొట్టుకుంటూ అక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ విషయాన్ని గ్రామస్థులు పోలీసులకు తెలపడంతో కదిరి డీఎస్‌పీ శ్రీలక్ష్మి, సీఐలు గోరంట్ల మాధవ్, ఎస్సై నాగేంద్రలు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి గొడవకు గల కారణాలపై ఆరా తీశారు. అయితే గతంలో రవి ఆస్తి తగాదాల వలన నాకు ముప్పు ఉందని పోలీసులకు తెలిపినట్లు గ్రామస్తులు నుండి వినవస్తోంది. ఎస్సై నాగేంద్ర కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.