క్రైమ్/లీగల్

ఆగి వున్న లారీని ఢీకొన్న దిచక్ర వాహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, జూన్ 17 : పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో దేవాంగ కల్యాణ మంటపం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఆగి వున్న లారీని ద్విచక్ర వాహనం బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో పట్టణంలోని దుర్గానగర్‌కు చెందిన షామీర్, ఇతని చెల్లెలు షాజిత, షాజిత కుమార్తె చిన్నారి పాహియాలు తీవ్రంగా గాయపడ్డారు. కాగా అనంతపురం సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి పాహియా మృతి చెందినట్లు సీఐ హరినాథ్ తెలిపారు. సంఘటన వివరాల్లోకి వెళితే పట్టణానికి చెందిన షామీర్,, షాజితలు శనివారం తలుపుల మండలంలో రంజాన్ పండుగను సంతోషంగా చేసుకుని ఆదివారం పట్టణానికి తిరిగి వస్తున్న సమయంలో మార్కెట్ యార్డు వద్ద ఆగి వున్న లారీని వెనుక వైపు ద్విచక్ర వాహనం ఢీకొట్టారు. దీంతో అక్కడే తీవ్ర రక్తస్రావం అయి రోడ్డుపై పడ్డారు. వీరితోపాటు వస్తున్న చిన్నారి పాహియా కూడా తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సీఐ హరినాథ్ సిబ్బందితో సంఘటన స్థలానికి, ఆసుపత్రికి వెళ్ళి క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం పోలీసు వాహనంలోనే అనంతపురంలోని సవేరా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వెంటనే స్పందించి పోలీసు వాహనంలోనే సవేరా ఆసుపత్రికి తరలించడంతో పెద్దల ప్రాణాలు వైద్యులు కాపాడారు. అయితే చిన్నారి పాహియా తలకు తీవ్రమైన గాయం కావడంతో రక్తస్రావం అధికంగా అయి చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు స్పందించిన తీరుకు కుటుంబ సభ్యులతోపాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఫొటోరైటప్‌ః
విష గుళికలు మింగి వ్యక్తి మృతి
పుట్లూరు, జూన్ 17 : పుట్లూరు మండలం రామలింగయ్యపల్లికి చెందిన రామచంద్ర (23) పుట్టుకతో రెండు కాళ్లు లేకుండా అవిటితనంతో పుట్టాడు. అతడికి పెళ్లి కాలేదని అవిటితనం చూసి తనకు ఎవరూ పిల్లను ఇచ్చి పెళ్ళి చేయడం లేదని, అవిటితనంతో తల్లిదండ్రులకు భారం కాకూడదని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని గత నెల రామచంద్ర పురుగుల మందు సేవించాడు. అపస్మారక స్థితిలో వుండగా అతని బంధువులు అతడిని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. మరలా తిరిగి ఈ నెల 16వ తేదీ ఉదయం తన స్నేహితుడైన కడవకల్లు గ్రామానికి చెందిన కుళ్ళాయప్ప ఇంటి వద్దకు వెళ్ళి వస్తానని చెప్పి ఇంటి నుండి బయలుదేరాడు. ఇంతలో రామచంద్ర విష గుళికలు మింగానని తన కుటుంబ సభ్యులకు తెలుపగా వారు అతడిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.