క్రైమ్/లీగల్

గుణ్ణంపల్లిలో దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, జూన్ 17: డబ్బుపై ఆశ .. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కౌజు పిట్టలను కొనుగోలు చేసేందుకు సొమ్ముతో పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ఓ వ్యాపారి ఫారంలో పనిచేసే కూలి అతికిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన మండలంలోని గుణ్ణంపల్లిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..తెలంగాణా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రంగాపురానికి చెందిన తాడూరి రమేష్ (40) ఆ గ్రామంలో చికెన్ షాపు నిర్వహిస్తూ, విరామ సమయంలో ఆటో నడుపుతూ ఉంటాడు. ఇతనికి భార్య విజయ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే..గత నాలుగేళ్లుగా రమేష్ మండలంలోని గుణ్ణంపల్లికి వచ్చి కౌజు పిట్టల ఫారంలో పిట్టలను కొనుగోలుచేసి, తన గ్రామంలో విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుఝామున 3గంటల సమయంలో రూ.25వేల నగదుతో కౌజు పిట్టలను కొనుగోలుచేసేందుకు స్వగ్రామం నుంచి బయల్దేరి గుణ్ణంపల్లి వచ్చాడు. అయితే ఒక రోజు గడిచినా రమేష్ ఇంటికి వెళ్లకపోవటంతోపాటు ఏ విధమైన సమాచారం లేకపోవటంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనతో ఆదివారం ఉదయం గుణ్ణంపల్లికి వచ్చారు. స్థానికులతో కలిసి వారు రమేష్ ఆచూకీ కోసం ఫారం పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయితే ఫారం వద్ద రక్తంతో తడిసిన అయిదు కేజీల తూకం రాయి, ఒక కర్ర కనిపించాయి. దీంతో మరింత ఆందోళనకు గురైన వారు గల్లారెడ్డి వేణుగోపాలరెడ్డికి చెందిన కొబ్బరి తోట ప్రాంతం నుంచి ఒక దుర్వాసన రావటాన్ని గుర్తించారు. సమీపంలోకి వెళ్లి గుట్టగా ఉన్న కొబ్బరాకులను తీసి చూడగా రమేష్ మృతదేహం బయటపడింది. దీంతో లబోదిబోమంటూ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సంఘటనా స్థలానికి వచ్చిన ఏలూరు డీఎస్పీ కె ఈశ్వరరావు, భీమడోలు సీఐ బిఎన్ నాయక్, ఎస్సై వీర్రాజు, క్లూస్ టీం ఘటనా స్థలాన్ని, మృతదేహం లభించిన ప్రాంతాన్ని పరిశీలించి, ఆధారాలను సేకరించారు.
కూలీయే హంతకుడు!
గుణ్ణంపల్లిలో దానాల వీరేంద్రకు చెందిన కౌజు పిట్టల ఫారంలో పనిచేస్తున్న పిఠాపురానికి చెందిన కూలి పిల్లా దుర్గారావు ఈ హత్య చేసినట్టుగా పోలీసులు నిర్థారించారు. కౌజు పిట్టలను కొనుగోలు చేసేందుకు నెలకు మూడు సార్లు స్వగ్రామం నుంచి సొమ్ముతో వచ్చే రమేష్‌ను డబ్బు కోసం దుర్గారావే హత్యచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఫారం వద్ద అయిదు కేజీల తూకం రాయి, కర్రతో రమేష్‌ను కడతేర్చి సమీపంలోని తోటకు ఈడ్చుకువెళ్లి, కొబ్బరి ఆకులతో కప్పి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. సుమారు నెల రోజుల క్రితం ఫారంలో కూలీగా చేరిన దుర్గారావు డబ్బు కోసమే రమేష్‌ను హతమార్చాడా?..లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతదేహానికి పంచానామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.