క్రైమ్/లీగల్

అంబుతో దాడిచేసి తమ్ముడిని హతమార్చిన అన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్థవీడు, జూన్ 17: అంబుతో దాడి చేసి దారుణంగా తమ్ముడిని అన్న హత్యచేసిన సంఘటన మండలంలోని వెలగలపాయం పంచాయతీ బొమ్మిలింగం చెంచుకాలనీలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన సారె పెద్దయ్య కుమారులు వెంకటేష్, నాగులు మధ్య గడ్డపార విషయంలో మనస్పర్థలు వచ్చాయి. ఈనేపథ్యంలో అన్న వెంకటేష్ శనివారం రాత్రి 10గంటల సమయంలో తమ్ముడు నాగులు (40)పై అంబుతో దాడి చేయడంతో పొట్టకు ఎడమవైపు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌ఛార్జి రామానాయక్ తెలిపారు.
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
అర్థవీడు, జూన్ 17: ఈతకు వెళ్లి డిగ్రీ విద్యార్థి మృతిచెందిన సంఘటన ఆదివారం జరిగింది. వివరాల మేరకు మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన రామలింగనాయక్ (20) గ్రామశివారులోని ఫారెస్టు అధికారులు తవ్వించిన నీటికుంటలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొడుతుండగా పూడులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక మృతిచెందినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఇన్‌ఛార్జి రామానాయక్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీయించారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.