క్రైమ్/లీగల్

నీటి కుంటలో మునిగి యువతి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురబలకోట, జూన్ 17: నీటి కుంటలో బట్టలు ఉతకడానికి వెళ్లిన ఓ యువతి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో మరో నలుగురు ప్రమాదంలో చిక్కుకోగా సమీపంలో గొర్రెలు మేపుతున్న ఓ యువకుడు వారిని సమయస్ఫూర్తితో కాపాడాడు. వివరాల్లోకి వెడితే భద్రయ్యగారిపల్లెకు చెందిన ఎస్.ముంతాజ్ (16), ఆమె సోదరి ఆయిషా (18), మరో కుటుంబానికి చెందిన షేక్ మహబూబ్ జాన్ (45), కుమార్తె తస్లీమా (19), అల్లుడు ఖాదర్‌బాషా (24)లు ఆదివారం మధ్యాహ్నం ఊరికి సమీపంలోని నీటి కుంటలో బట్టలు ఉతకడానికి వెళ్లారు. బట్టలు ఉతికిన తరువాత యువతులు నీటి కుంటలో దిగి ఈత కొట్టడానికి సిద్ధపడ్డారు. అయితే ఎస్.ముంతాజ్ కుంట మధ్యలో నీటిలో మునిగిపోతుండటంతో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. ఎవరికి ఈత రాకపోవడంతో అందరూ నీటిలో మునిగిపోవడం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు కేకలు వేయడంతో సమీపంలో గొర్రెలు మేపుతున్న ఎస్.ఇమ్రాన్ అక్కడకు చేరుకుని చీరను విసిరి ఒక్కొక్కరిని నీటి నుంచి పైకి లాగాడు. ముంతాజ్ అప్పటికే నీటిలో మునిగిపోయింది. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించే సరికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. రెండేళ్ల క్రితం ముంతాజ్ తల్లి పాముకాటుకు గురై కన్నుమూసింది. ఇప్పుడు ముంతాజ్ మృతి చెందడంపట్ల పలువురు కన్నీళ్లు పెట్టుకున్నారు. నలుగురి ప్రాణాలను కాపాడిన ఎస్.ఇమ్రాన్‌ను గ్రామస్థులు అభినందించారు.

కుటుంబ కలహాలతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి
తిరుపతి, జూన్ 17: కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటానంటూ మొలకలచెరువుకు చెందిన ఈశ్వర్ అనే వ్యక్తి ఆదివారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సెల్‌టవర్ ఎక్కాడు. దాదాపు అరగంట పాటు అతను సెల్ టవర్‌పై నుంచి కిందకు దూకేస్తానంటూ గట్టిగా అరుస్తూ అందరినీ హడలెత్తించాడు. అతను కిందకు ఎక్కడ దూకేస్తాడోనని ముందస్తు జాగ్రత్తగా ఫైర్ స్టేషన్ సిబ్బంది కింద వలను పట్టుకున్నారు. ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది అతనితో మాట్లాడి కిందకు దించారు. కుటుంబ కలహాలతోనే తాను ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించానని ఈశ్వర్ ఈ సందర్భంగా చెప్పాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.