క్రైమ్/లీగల్

భవనంపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 17: భవనంపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బోడుప్పల్ సాయి మారుతీనగర్‌లో నివసిస్తున్న నెల్లూరు లక్ష్మణ్ (26) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతడు ఎయిల్‌టెల్‌లో పనిచేస్తున్న భావన (25)ను 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శనివారం రాత్రి ఇంట్లో బాల్య స్నేహితుడైన రఘు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. రాత్రంతా స్నేహితులతో ఎంజాయ్ చేసిన లక్ష్మణ్ ఆదివారం తెల్లవారుజామున మూడో అంతస్తు భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.