క్రైమ్/లీగల్

పాల వ్యాన్ బోల్తా పడి డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాకవరపాలెం, జూన్ 17 : వాల వ్యాన్ బోల్తా పడిన సంఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఈసంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కశింకోటకు చెందిన పెంటకోట చందు (20) హెరిటేజ్ పాల వ్యాన్‌లో కొంత కాలంగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం కూడా నర్సీపట్నం వచ్చిన వ్యాన్ తిరిగి కశింకోట బయలు దేరింది. అయితే పాల వ్యాన్ మండలంలో రామన్నపాలెం వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న బైక్‌ను డీ కొని బోల్తా పడింది. ఈసంఘటనలో వ్యాన్ మూడు ఫల్టీలు కొట్టడంతో డ్రైవర్ చందు క్యాబిలో నుంచి బయట పడగా అతనిపై వ్యాన్ పడిపోయింది. దీంతో వ్యాన్ కింద ఇరుక్కొని చందూ మృతిచెందాడు. ద్విచక్ర వాహనంపై వస్తున్న దర్జి రామునాయుడు ,నమ్మి బాలాజీలకు స్వల్పగాయాలయ్యాయి. సంఘటన విషయం తెలుసుకున్న ఎస్సై విజయ్‌కుమార్ అక్కడికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. వెంటనే ప్రొక్ల్రైనర్‌తో వ్యాన్‌ను లేపి మృత దేహాన్ని బయటకు తీసారు. బైక్‌పై వస్తున్న వారిని ఎస్సై విచారించగా రామన్నపాలెం జంక్షన్ నుంచి పెట్రోల్ వేసుకునేందుకు తాము వెళ్తుండగా వ్యాన్ తమపైకి వస్తుందనే భయంతో బైక్ పై నుంచి పక్కనే ఉన్న తుప్పల్లోకి దూకేసామని తెలిపారు. దీంతో వ్యాన్ బోల్తా పడిందన్నారు. ఇదిలా ఉండగా రాచపల్లి జంక్షన్‌లో ఉన్న ఫారెస్ట్ చెక్‌పోస్టును ఢీ కొన్న పాల వ్యాన్ అతివేగంతో వెళ్ళడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈసంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.