క్రైమ్/లీగల్

ధర్మపురిలో దొంగతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, జూన్ 18: ధర్మపురి క్షేత్రంలో బ్రాహ్మణ వాడలో సోమవారం పట్టపగలు చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటిలో గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి విలువైన బంగారు, వెండి ఆభరణాలు నగదు దొంగిలించారు. క్షేత్రంలోని బ్రాహ్మణ వాడలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ అలువాల దత్తాత్రి తన కుమారుడైన నరేశ్‌తో సోమవారం ఉదయం 10గంటలకు స్వంత పనిమీద జగిత్యాల వెళ్ళగా, ఆయన భార్య మంజుల పక్కఇంటికి 11గంటలకు తాళం వేసి వెళ్ళింది. తిరిగి మధ్యాహ్నం 2గంటలకు మంజుల ఇంటికి వెళ్ళి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించి, భయంతో పరుగెత్తగా, ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా ఇంటి గొళ్ళాలు, తాళాలు, బెడ్‌డ్‌రూం తాళాలు పగులగొట్టబడి, వస్తు సామగ్రి చిందర వందరగా పడి ఉన్నాయి. ఇంటిలో ఎవరూ లేకుండా చూసి, ఆగంతకులు ఇంటి ఆవరణలో ప్రవేశించి, ఉత్తర ద్వారంకు గల గొళ్ళెం, తాళంను పగులగొట్టి, అనంతరం బెడ్‌రూం గదికూడా ఇలాగే చేసి, రెండు బీరువాలలోని వస్తువులను గ్రహించి, దొంగతనానికి పాల్పడడం జరిగింది. సమాచారం అందుకున్న దత్తాత్రి ఇంటికి త్వరిత గతిన చేరి, చూడగా, బీరువా, ఇతర చోట్ల గల పదిహేడున్నర తులాల బంగారు, 12తులాల వెండి ఆభరణాలు, 45వేల నగదు చోరీకి గురైనట్లు కనుగొని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందే ధర్మపురి సీఐ లక్ష్మీబాబు, ఎస్‌ఐ లక్ష్మీనారయణలు హుటాహుటిన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. జగిత్యాల ఎస్పీ సునిల్ దత్, డీఎస్పీ భద్రయ్యతో కలిసి వచ్చి, సంఘటన స్థల సందర్శన చేసి, దొంగతనం తీరుతెన్నులపై ఆరా తీసారు. పలు కోణాలలో పరిశీలించారు. ఫింగర్ ప్రింట్స్ సీఐడీ ఎస్‌ఐ రాజు నేతృత్వంలో, మహేశ్, అనిల్ రాత్రి చాలా సేపటి వరకు సుదీర్ఘ సమయం వేలి ముద్రలను సేకరించారు. పక్కనే గల ఒజ్జల ప్రవీణ్ శాస్ర్తీ ఇంటిలో ప్రవేశించిన ఆగంతకులు, పైన సాయి దేవాలయ పూజారికి చెందిన 5వేల నగదు దొంగిలించుకు వెళ్ళారు. ఇంటిలో కుర్చీపై చిల్లరతో కూడిన లేడీ పర్స్ వదిలి ఉండడాన్ని బట్టి, మహిళకూడా పాల్గొన్నట్లు తెలుస్తున్నది.