క్రైమ్/లీగల్

అనుమానాస్పద స్థితిలో చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్ రూరల్, జూన్ 18: హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో నిదనపురం సిరివల్లి (6) అనే చిన్నారి అనుమానాస్పద స్థితిలో సోమవారం శవమై కనిపించింది. కాగా తన మామే చిన్నారిని గొంతునులిమి హత్య చేశాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే చెల్పూర్ గ్రామానికి చెందిన నిదనపురం సంతోష్, స్వరూప దంపతులు జమ్మికుంటలో నివాసముంటున్నారు. కాగా వీరి కూతురు సిరివల్లి జమ్మికుంటలోని లోటస్‌పాండ్ పాఠశాలలో నర్సరీ చదువుతోంది. రంజాన్‌తో పాటు ఆదివారం సెలవులు రావడంతో సిరివల్లి చెల్పూరులోని తాత ఇంటికి వచ్చింది. సిరివల్లి చనిపోయిందని సమాచారం రావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన సోమవారం ఉదయం చెల్పూర్‌లోని తమ ఇంటికి చేరుకున్నారు. బాలిక గొంతుపై కమిలిపోయి ఉండడం గమనించి తాత అయిన నిదనపురం రవి తన మనుమరాలైన చిన్నారి సిరివల్లిని గొంతునుమిలి చంపి ఉంటాడని కోడలు స్వరూప పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక చనిపోయిన తర్వాత తొందరగా తన మామ రవి బయటకు వెళ్లినట్లు తన అత్త కోమల తెలిపిందని స్వరూప ఫిర్యాదులో పేర్కొంది. మృతి చెందిన బాలికను మొదట చెల్పూరులోని ఆర్ ఎం పీ వైద్యుడి వద్దకు అనంతరం జమ్మికుంటలోని ఆసుపత్రికి తీసుకువెళ్లామని అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారని ఆమె ఫిర్యాదులో తెలిపింది. తాము జమ్మికుంటలో వేరుకాపురం పెట్టినప్పటి నుండి అత్తమామలకు, తమకు మధ్య గొడవలు జరుగుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకునే తమ కూతురు సిరివల్లిని తాతే గొంతు నులిమి చంపిఉంటాడని పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మృతురాలి తల్లి స్వరూప ఇచ్చిన ఫిర్యాదుపై హుజూరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.