క్రైమ్/లీగల్

కారు బైకును ఢీకొని ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనగల్, జూన్ 18: మండలంలోని రంగారెడ్డి బంగ్లా వద్ద కారు బైకును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఒకరు మృతిచెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై నర్సింహులు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ నుండి మల్లేపల్లికి వెళుతున్న కారు ముందుగా వెళ్తున్న బస్సును ఓవర్‌టేక్ చేయబోయి గుర్రంపోడ్ నుండి బైకుపై వస్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో పిట్టలగూడెం, చామలోనిబావి గ్రామాలకు చెందిన పోలె వెంకన్న (28) అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు యువకులు లింగయ్య, శంకర్‌లు తీవ్రంగా గాయపడగా వీరిని నల్లగొండ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈఘటనపై మృతుని భార్య సాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.