క్రైమ్/లీగల్

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, జూన్ 19: నగరంలోని నారాయణరెడ్డి కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి యమ్. శ్రీరామలు(44)ని సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు నారాయణరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నారు. సోమవారం గుత్తి కోర్టుకు హాజరవ్వటం జరిగిందన్నారు. అనంతరం నగరానికి చేరుకొన్న శ్రీరాములు రాత్రి బయటికి వెళ్లినట్లు తెలిపారు. గుత్తి రోడ్డులోని మాంటిస్సోరి పాఠశాల వద్ద ఎవ్వరో గుర్తుతెలియని వ్యక్తులు శ్రీరామలు తలపై బలమైన రాయితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.