క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాండ్లపెంట, జూన్ 19: మండల పరిధిలోని కదిరి-రాయచోటి ప్రధాన రహదారిలోని తాళ్లకాల్వ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్.పీకుంట మండలం గోపాలపురంకు చెందిన బీ.చక్రే నాయక్ (17) అక్కడికక్కడే మృతి చెందగా, అదే మండలంలోని సున్నపుగుట్టతండాకు చెందిన మురళీ నాయక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. చక్రే నాయక్, మరళీ నాయక్‌లు కదిరి నుండి ద్విచక్ర వాహనంలో స్వగ్రామంకు వెళ్తుండగా తాళ్లకాల్వ సమీపంలోకి రాగానే వాహనం నడుపుతున్న చక్రే నాయక్‌కు మూర్ఛ వ్యాధి రావడంతో ఒక్కసారిగా ద్విచక్ర వాహనం రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చక్రేనాయక్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరళీ నాయక్‌ను చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య సేవల కోసం అనంతపురంకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. అతనికి అప్పుడప్పుడు మూర్ఛవ్యాధి వచ్చేదని మృతుడి అన్న దేశేనాయక్ పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ధర్మవరంలో గుర్తుతెలియని వ్యక్తి మృత్తి
ధర్మవరం టౌన్, జూన్ 19: ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్‌లో మంగళవారం గుర్తుతెలియని బిచ్చగాడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఆర్టీసీ బస్టాండ్‌లో మృతి చెందిన వ్యక్తి(52) సంవత్సరాలు ఉంటాయని, ఇతను ఇటీవల కాలంలో ఇక్కడికి వచ్చి ప్రతి రోజు బిచ్చమెత్తుకుంటు ఉండేవాడన్నారు. అయితే ఎంతసేపటికి లేవకపోవడంతో మృతి చెందినట్లు ధ్రువీకరించి మున్సిపాలిటీ వారికి అప్పగించడం జరిగిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
అనంతపురం అర్బన్, జూన్ 19: నగరంలోని శ్రీకంఠం సర్కిల్‌లోని ఓ ప్రధాన లాడ్జిలో ఓ వ్యక్తికి ఎటువంటి ఐడీ కార్డులు లేకుండా కనీసం ఆధార్ కార్డులు లేకుండా లాడ్జిని అద్దెకు ఇచ్చారు. లాడ్జిలో దిగిన వ్యక్తి లాడ్జిలో నిర్వహించే ఎంట్రీ రికార్డుల్లో తన పేరు రాధాకృష్ణ అని, తన స్వగ్రామం నార్పల అని రాశాడు. లాడ్జిలో దిగిన వ్యక్తి సోమవారం రాత్రి తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. మంగళవారం గదిలో ఉన్న వ్యక్తి ఎంతకు తలుపు తీయకపోవటంతోపాటు గడి పెట్టుకోవటంతో అనుమానం వచ్చి లాడ్జి యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న వన్‌టౌన్ పోలీసులు ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి వివరాల సేకరణను ప్రారంభించారు. లాడ్జి ఎంట్రీ పుస్తకంలో తన పేరు తప్పుగా నమోదు చేయటంతోపాటు తన స్వగ్రామం నార్పల అని రాసి ఉండటం కూడా తప్పని నిర్ధారణకు వచ్చారు. శవాన్ని అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఎవరైనా బంధువులకు అనుమానం ఉంటే సర్వజన ఆసుపత్రిలోని మార్చురీలో శవాన్ని గుర్తించి తగిన ఆధారాలతో వస్తే అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.