క్రైమ్/లీగల్

రెండు బైకులు ఢీకొని యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్లపాలెం, జూన్ 19: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓయువకుడు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన బుద్దాం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన కుంచాల యేసుబాబు యాజలి వైపునుండి కర్లపాలెం వస్తుండగా కర్లపాలెం నుండి బుద్దాంవైపు వెళుతున్న మరోబైకు ఎదురెదురుగా ఢీకొన్నాయి. యేసుబాబు(35) అక్కడి అక్కడే మృతి చెందగా చింతాయపాలెం గ్రామానికి చెందిన మరోవ్యక్తి తీవ్రంగా గాయాపడ్డాడు. ఎస్‌ఐ హజరత్తయ్య తన సిబ్బంతో సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక సమాచారం సేకరించారు. క్షతగాత్రుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈమేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హజరత్తయ్య తెలిపారు.

మునగపాడులో ఆరు పూరిళ్లు దగ్ధం
ఫిరంగిపురం, జూన్ 19: మండల పరిధిలోని మునగపాడు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఆరు పూరిళ్లు అగ్నికి ఆహూతయ్యాయి. స్థానికుల కథనం మేరకు... సాకే సుబ్బారావు ఇంటి నుండి మంటలు వచ్చాయని, గాలి ఉద్ధృతంగా వీచడంతో పక్కనే ఉన్న మరో ఐదు పూరిళ్లకు మంటలు వ్యాపించి ఆరు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయన్నారు. సుబ్బారావు కుమార్తె వివాహం మరో రెండు రోజుల్లో జరగాల్సి ఉండగా వివాహ నిమిత్తం ఎవరూ ఇంట్లో లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ఘటనలో వీరపనేని వెంకటేశ్వర్లు, సాకే రాంబాబు, సాకే సుబ్బారావు, సాకే కృష్ణ, సాకే నరసింహారావు, కాకాని మహబు గృహాలు అగ్నికి ఆహూతయ్యాయి. దీంతో ఆరు కుటుంబాల వారు కట్టుబట్టలతో మిగిలారు. ప్రమాదానికి షార్ట్ సర్యూట్ కారణమని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న తహశీల్దార్ పార్ధసారథి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు 20 కేజీల బియ్యం, 5 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.