క్రైమ్/లీగల్

సినీఫక్కీలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిల్లకూరు, జూన్ 19: మండల పరిధిలోని ఓడూరు హరిజనవాడలో ఎఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగిశెట్టి వెంకటరమణయ్య ఇంటిలో మంగళవారం తెల్లవారుఝామున తలుపులను తొలగించి సినీఫక్కీలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికలాంగుడైన వెంకటరమణయ్య ఆరుబయట నిద్రిస్తుండగా పురాతన ఇంటి నివాసంలోని తలుపులను తొలగించి ఇంటిలోని బీరువాలో దాచిన 2.76 లక్షల రూపాయల నగదు, 34 సవర్ల బంగారు, ఇతర వెండి ఆభరణాలను దోచుకెళ్లినట్లు చిల్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిఐ అక్కేశ్వరరావు రూరల్ ఎస్సై బాబి, మనుబోలు ఎస్సై శ్రీనివాసులురెడ్డిలను సంఘటనా స్థలానికి పంపించారు. సమాచారం అందుకున్న పోలీసులు నెల్లూరు నుండి క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి చోరీకి గురైన వివిధ కోణాలపై ఆరా తీశారు. బాధితుడు వెంకటరమణయ్య, తమ కుటుంబ సభ్యులు గత మూడు రోజులుగా తమ బంధువుల ఇళ్లకు వెళ్లారని తాను ఒక్కడినే ఇంటి వద్దనే ఉండి ఆరుబయట నిద్రిస్తుండగా పురాతన తలుపులను తొలగించి బీరువాలో దాచి ఉన్న నగదు, బంగారు వస్తువులను అపహరించుకెళ్లినట్లు తెలిపారు. తమ కుమార్తె, చదువు, వివాహం నిమిత్తం తమకు రావాల్సిన బకాయిలను తెచ్చి ఇంటిలో భద్రపర్చామన్నారు. స్థానికంగా ఉన్న కొందరు యువకులు తమ ఇంటిపై రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం లేచిచూడగా ఇంటిలో ఉన్న వస్తువులను చెల్లాచెదరుగా పడేసి బీరువాతాళం తొలగించి అందులో దాచివున్న నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు ఫిర్యాదు చేశారు.