క్రైమ్/లీగల్

కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 19: గత నెల 12న బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన మైనర్ కిడ్నాప్ కేసును చేధించి ఇద్దరిని బాలానగర్ పోలీసులు అరెస్టు చేసినట్లు డిఎస్పీ భాస్కర్ వెల్లడించారు. మంగళవారం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలానగర్ మండలానికి చెందిన సుజాత అనే మహిళ తన కూతురితో కలిసి జీవనం కొనసాగిస్తుండేది. అయితే మంజూల అనే మహిళతో సుజాతకు పరిచయం ఏర్పడింది. దీంతో ప్రతిరోజు మంజూల కూలీపనుల నిమిత్తం బాలానగర్‌కు వస్తూ సుజాత ఇంటికి వచ్చి బాలికకు ఇష్టమైన ఆట వస్తువులు, తినుబండారాలను ఇప్పిస్తూ చనువుగా ఉండేది. ఇలా ఉండగా మంజూలకు వివాహమై పిల్లలు కాకపోవడంతో భర్త రవితో కలిసి బాలికను లారీలో కర్నూల్ జూపాడు మండలం సరిగోపుల గ్రామానికి తీసుకెళ్లి వారి ఇంట్లో బంధిం చింది. రవి స్నేహితుడైన రాజుకు మైనర్ అయిన చిన్నారిని ఇచ్చి పెళ్లి చేసేందుకు ప్రయత్నించింది. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంజుల ఫోన్ కాల్స్ ఆధారంగా కర్నూల్ జిల్లాకు వెళ్లి బాలికలను అదుపులోకి తీసుకుని నిందితులను అరెస్టు చేశామని డిఎస్పీ భాస్కర్ తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని త్వరలోనే నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో జడ్చర్ల సీఐ రవీందర్‌రెడ్డి, బాలానగర్ ఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.