క్రైమ్/లీగల్

గ్యాంగ్ రేప్ నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, జూన్ 19: కల్వకుర్తి పట్టణంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన గ్యాంగ్ రేప్ నిందింతులను 24 గంటలు దాటకముందే పోలీసులు గుర్తించారు. మంగళవారం సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ ఎల్‌సీ నాయక్ వివరాలు వెల్లడించారు. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో వివాహిత మెడిసిన్ తీసుకొని వెళ్తుండగా ఆమెను రెండు బైక్‌లపై వెంబడించారు. తమ కోరిక తీర్చాలని నలుగురు యువకులు బలవంతం చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల అవరణలోకి తీసుకెళ్లి ముగ్గురు యువకులు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈసందర్భంగా మహిళ కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు రావడంతో నిందితులు తమ బైక్‌లను వదిలి పారిపోయారు. దాంతో బైక్‌ల నెంబర్ల ఆధారంగా 24 గంటలలోపే నిదింతులను గుర్తించామని డిఎస్పీ ఎల్‌సీ నాయక్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కల్వకుర్తి పట్టణ సమీపంలో గల జేపీనగర్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. విలేఖరుల సమావేశంలో సీఐ గిరికుమార్, ఎస్‌ఐలు రవి, బాలకృష్ణ, ఏఎస్‌ఐ కృష్ణయ్య, సిబ్బంది ఉన్నారు.
* సంఘటన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఇలా ఉండగా వివాహితపై అత్యాచారం జరిగిన సమాచారం అందుకున్న నాగర్‌కర్నూల్ కలెక్టర్ శ్రీ్ధర్, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌లు మంగళవారం ఉదయం అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అత్యాచారానికి గరైన మహిళకు ప్రభుత్వం, పోలీసు శాఖ అండగా ఉంటుందని వారు భరోసా అందించారు.