క్రైమ్/లీగల్

గొంతుకోసి దంపతుల దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, జూన్ 19: వరంగల్ అర్భన్ జిల్లాలోని హసన్‌పర్తి మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి అతి ఘోరం జరిగింది. దంపతుల కళ్లల్లో కారంపొడి చల్లి, గొంతుకోసి అతి దారుణంగా హతమార్చిన సంఘటనతో మండల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. హసన్‌పర్తి గ్రామానికి చెందిన గడ్డం దామోదర్(56), పద్మ(48) దంపతులు హసన్‌పర్తి జాతీయ రహాదారి పక్కనే కిరాణం షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు . దంపతులు గడ్డం దామోదర్ కిరాణం అండ్ జనరల్ స్టోర్ పేరుతో కిరాణం షాపు నడుపుకుంటూ ఒంటరిగానే జీవిస్తున్నారు. సోమవారం రాత్రి కిరాణం షాపుమూసివేసిన తదుపరి ఇంట్లోకి వెళ్లి గేట్ పెట్టుకున్నారు. దంపతులు రాత్రి డిన్నర్ ముగించుకుని టివి చూస్తూ పడుకున్న సమయంలోనే దుండగులు వారి ఇంటి ప్రహారి గోడ దూకి లోనికి ప్రవేశించారు. వెంటనే దుండగులు అకస్మాత్తుగా ఇంట్లోకి చొరబడి, దంపతుల కళ్లల్లో కారంపొడి చల్లి దాడికి పాల్పడ్డారు. బార్య కళ్లె ఎదుటే పడుకున్న బెడ్‌పై భర్తను అతి దారుణంగా గొంతుకోసి చంపేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన బాత్‌రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకున్న భార్యను వదలలేదు. బీరువాలో ఉన్న నగదు, ఆమెపై ఉన్న బంగారు అభరణాలను కూడా లాక్కెళ్లిన సంఘటన హసన్ పర్తి మండల కేంద్రంలో సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కన్నీరు, మున్నీరయ్యారు. ఎవ్వరిని చూసిన కంటతడి పెట్టుకున్న దృశ్యాలే కనిపించాయి. హసన్‌పర్తి మండల కేంద్రంలో జరిగిన జంట హత్యల విషయాన్ని తెలుసుకున్న వరంగల్ పోలీసు కమీషనర్ డా.వి రవీందర్, వెస్ట్‌జోన్ డిసిపి వెంకట్‌రెడ్డి, కాజీపేట ఎసిపి సత్యనారాయణ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరును, మృతుల ఇంటి చుట్టు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అంతేకాకుండా డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంను రప్పించి విచారణ వేగవంతం వేసారు. హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలకు పంచనామ నిర్వహించి, పోస్టుమార్టంకోసం ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.
పకడ్భందిగా కేసు విచారణ: వెస్ట్‌జోన్ డిసిపి వెంకట్‌రెడ్డి
జంట హత్యల కేసును పకడ్భందిగా విచారణ చేపట్టి వీలైనంత త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని వెస్ట్‌జోన్ డిసిపి వెంకట్‌రెడ్డి అన్నారు. నగదు, బంగారం కోసమే హత్య చేసార, కారంపొడి చల్లిన తీరు పలు అనుమానాలు కలిగిస్తోందని, సైంటిపిక్‌గా, సిసి పుటేజీలు పరిశీలించి కేసును చేదిస్తామని పేర్కొన్నారు. 15రోజులుగా హసన్‌పర్తి గ్రామానికి చెందిన ఒక యువకుడు వారి కిరణం షాపు వద్దే ఉంటూ వారిని గమనిస్తున్నాడని తెలిసింది. మొత్తానికి హత్యలు చేసింది మాత్రం దొంగలు కాదని, ఇది స్థానికుల పనేనని పలువురు చర్చించుకుంటున్నారు.