క్రైమ్/లీగల్

మల్కపేటలో దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోనరావుపేట, జూన్ 19: కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన ఎల్లంకి శ్రీనివాస్(50), పద్మ(45) దంపతులు బలవన్మరణం పొందారు. మంగళవారం ఉదయం ఇంటిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పులు ఆర్థిక ఇబ్బందులకు తోడు అనారోగ్యం ఈ చర్యకు కారణాలు అని తెలిసింది. శ్రీనివాస్‌కు సుమారు రూ.30 లక్షల మేరకు అప్పులు కాగా, అప్పులు చెల్లించలేని పరిస్థితిలో కొంత కాలంగా మనోవేదనకు గురవుతున్నట్టు తెలిసింది. దంపతులకు కుమారుడు సిరిసిల్లలో నివాసం ఉండగా, కూతురుకు వివాహం అయింది. మల్కపేటలో దంపతులిద్దరే ఉంటూ ఆర్థిక ఇబ్బందులకు తోడు అనారోగ్యం తోడు కావడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కోనరావుపేట ఎస్సై రమేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆరు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
తిమ్మాపూర్, జూన్ 19: మండలంలోని మోయతుమ్మెద వాగు నుండి అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెట్టుకొని అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను మంగళవారం ఎల్‌ఎండీ ఎస్సై నరేష్ రెడ్డి పట్టుకున్నారు. మండలంలోని రేణికుంట గ్రామ శివారులో మోయతుమ్మెద వాగు నుండి అనుమతి ఉన్నట్లు నమ్మిస్తూ అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం మేరకు తమ టీంతో దాడి చేయగా ఉదయం రెండు ట్రాక్టర్లు, మధ్యాహ్నం నాలుగు ట్రాక్టర్లు దొరికినట్లు తెలిపారు. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ తరలించారు.