క్రైమ్/లీగల్

ఆలి అవమానించిందని యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, జూన్ 21: భార్యభర్తల గొడవ విషయంపై పోలీసు స్టేషన్లో పంచాయతీ జరుగుతుండగా ఆవేశంతో భార్య భర్తపై చెప్పుతో కొట్టింది. అవమాన భారంతో భర్త ఇంటికి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాట్రాయిలో గురువారం జరిగింది. పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్స్ సమక్షంలో భార్య చెప్పుతో కొడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు మృతదేహాన్ని పోలీసుస్టేషన్ ఎదుట ఉంచి, ధర్నాకి దిగారు. తమకు న్యాయం చేయాలని బైఠాయించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చాట్రాయి మండలానికి చెందిన తాళ్ళూరి ఆదాం కుమారుడు కిషోర్ (25)తో సి గుడిపాడు గ్రామానికి చెందిన శ్యామలతో గత ఏడాది వివాహం జరిగింది. వివాహం జరిగిన నెలలోపే ఇద్దరి మధ్య వివాదాలు వచ్చాయి. భర్త కిషోర్ నిత్యం వేధిస్తున్నాడని, కాపురం చేయలేనని శ్యామల పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసింది. దీనిపై గ్రామ పెద్దలు, పోలీసుల సహకారంతో పంచాయితీ నిర్వహించి భర్త కిషోర్ లక్ష రూపాయలను శ్యామలకు ఇచ్చే విధంగా ఒప్పందం చేశారు. ఒప్పందం ప్రకారం లక్ష రూపాయలను కిషోర్ ఇచ్చేశాడు. గత కొద్దికాలం నుండి కిషోర్ విజయవాడలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. ఈ తరుణంలో భార్య శ్యామల గురువారం చాట్రాయి పోలీసుస్టేషన్‌లో తనను ఇంకా భర్త కిషోర్ వేధిస్తున్నాడని పేర్కొంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు కిషోర్‌ను పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. మాట్లాడుతుండగా శ్యామల పోలీసు కానిస్టేబుల్ చెప్పు తీసుకుని భర్త కిషోర్‌పై దాడి చేసింది. ఈ పరిణామంతో ఖంగుతిన్న కిషోర్ ఇంటికెళ్లి భార్య చెప్పుతో కొట్టిందన్న మనోవేదనతో సూసైడ్ నోట్ రాసుకుని, ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత కుటుంబానికి దళిత సంఘాలు బాసటగా నిలిచాయి. పంచాయితీకి పిలిపించి, పంచాయితీ చేస్తున్న సమయంలో భార్య భర్తపై దాడి చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ స్టేషన్ ఎదుట కిషోర్ మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు. రాత్రి 8.30 గంటల వరకు ధర్నా కొనసాగుతూనే ఉంది. డిఎస్పీ ప్రసాద్ సంఘటన స్థలానికి వచ్చి బాధితులతో మాట్లాడారు. జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేస్తే విచారించి తగు చర్యలు తీసుకుంటామని డిఎస్పీ ప్రసాద్ బాధితులకు తెలిపారు.