క్రైమ్/లీగల్

ప్రమాదవశాత్తు ఒంగోలు సమ్మర్ స్టోరేజి ట్యాంకులో పడి ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 18: ఒంగోలు నగరంలోని మొదటి సమ్మర్ స్టోరేజి ట్యాంకు నీటిలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ సిఐ గంగా వెంకటేశ్వర్లు అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఒంగోలులోని మిరియాలపాలెం కు చెందిన సురేష్ లేట్, రూతుమ్మ దంపతులకు చెందిన ఇద్దరు కుమారులు అయిన బేలుదారి మేస్ర్తీ వైడిపోగుల కిరణ్ బాబు (15) 5వ తరగతి చదువుతున్న విద్యార్థి మనోహర్ (12) అనే వారు ఇద్దరు కలసి ఆదివారం ఒంగోలు నగరంలోని మొదటి సమ్మర్ స్టోరేజి ట్యాంకు వద్దకు వెళ్లటం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మనోహర్‌కి దాహం వేయటంతో సమ్మర్ స్టోరేజిలో దిగి మంచి నీళ్లు తాగే క్రమంలో ప్రమాదవశాత్తూ సమ్మర్ స్టోరేజి ట్యాంకు నీళ్లలో జారిపడడంతో తమ్ముడిని రక్షించే క్రమంలో కిరణ్‌బాబుతోపాటు మనోహర్ ఇద్దరూ కూడా ప్రమాదవశాత్తూ నీళ్లలో పడి మృతి చెందినట్లు సీఐ తెలిపారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న తాము సంఘటానాస్థలాన్ని పరిశీలించి మృతదేహాలను వెలికితేసేందుకు తమ పోలీసు సిబ్బంది చర్యలు చేపట్టినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇదిలా ఉండగా విషయాన్ని తెలుసుకున్న మృతుల బంధువులతోపాటు చుట్టు పక్కలవారు సమ్మర్ స్టోరేజి ట్యాంకు వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు.