క్రైమ్/లీగల్

రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూన్ 21: గజ్వేల్ మండల పరిదిలోని బంగ్లవెంకటాపూర్‌లో ఓ రైతు అప్పులబాదతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబందించి బాదితులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన యాదగిరి(55) తనకున్న 2 ఎకరాల పొలంలో పంటలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలాగే సాగునీటి వసతులు లేకపోవడంతో బోర్లు వేయగా రూ. 5లక్షల వరకు అప్పులు చేశాడు. అయితే కాలం కలిసి రాకపోవడం, సాగు చేసిన పంటలు నష్టపోతుండడంతో అప్పులు తీర్చే మార్గం కానరాక యాదగిరి తన ఇంటి సమీపంలోని పశువుల కొట్టంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి బార్య కిష్టమ్మతో పాటు ఓ కుమారుడు, ఓ తుతురులున్నారు. బాదితుల ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.