క్రైమ్/లీగల్

కాలువలో పడి ఇద్దరు స్నేహుతులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరవలి, జూన్ 22: పెరవలి అరుంధతీయపేటలో చిన్ననాటి నుండి కలిసి తిరిగిన ఇద్దరు స్నేహితులు కాలువ వంతెనపై బైకుపై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ సైడ్ వాల్‌ను ఢీకొట్టి కాల్వలోకి జారిపడి మృతి చెందిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. దీనితో పెరవలిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోని నరసాపురం మెయిన్ కెనాల్‌పై ఉన్న పాత లాకుల వంతెన సైడు గోడలను గురువారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తూ బైకు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంబవించింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన మెరిపే జాన్‌విస్లే (44), తానికొండ జాషువా డేనియేల్ (45) మృతిచెందారు. కాల్వలోని సాగునీటి ఉద్ధృతికి కొట్టుకునిపోయిన వీరి మృతదేహాలను 5 కిలోమీటర్ల అవతల రాపాక గ్రామ సమీపంలో సహాయక బృందాలు గాలించి స్వాధీనం చేసుకున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. పెరవలికి చెందిన జాన్‌విస్లే, డేనియేలు గురువారం రాత్రి పెరవలిలో ఒక శుభ కార్యక్రమానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం సంభవించింది. వీరు ప్రయాణిస్తున్న బైక్ వంతెనపై అదుపుతప్పి వంతెన సైడు గోడలను ఢీ కొట్టింది. వంతెనపై సైడు గోడలు శిథిలమై ఉండటం వల్ల వీరు కాల్వలోకి జారిపడి గల్లంతై ఉంటారని భావిస్తున్నారు. కాల్వలో నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో ఇద్దరూ చాలా దూరం కొట్టుకొనిపొయారు. తెల్లవారుజాము నుంచి నుండి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రిస్క్ టీం సభ్యులు బృందంగా ఏర్పడి కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. కాల్వలో రాపాక సమీపంలో శుక్రవారం ఉదయం ముందుగా జాన్‌విస్లే మృతదేహం లభ్యమైంది. అక్కడే గాలించగా మధ్యాహం 3 గంటలకు డేనియేల్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై పేరూరి నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చెస్తున్నారు. మృతులిరువురూ సేహ్నతులు:
మృతిచెందిన జాన్‌విస్లే, డేనియేల్ చిన్నానటి నుంచి మంచి స్నేహుతులు. ఎక్కడకు వెళ్లినా కలిసి వెళ్లే వారు.. తిరిగేవారు. చివరకు ఆఖరి మజిలీ కూడా కలిసే వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జాన్‌విస్లే స్ధానికంగా ఒక ప్రైవేటు స్కూలు యాజమాని కుమారుడు. అతను తణుకులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఫిజియోథెరఫిస్ట్‌గా వైద్య సేవలు అందిస్తున్నాడు. అతని ఇంటి సమీపంలోనే డేనియేల్ కుటుంబం నివాసం ఉంటోంది. ఇద్దరూ ఎక్కువ సమయం కలిసే ఉండేవారు. మృతిచెందిన జాన్ విస్లేకు భార్య ఇద్దరు కూమారులు ఉన్నారు. డేనియేల్‌కు భార్య ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
శిథిలమైన వంతెన పక్క గోడల వల్లే ప్రమాదం
ప్రమాదం సంభవించిన వంతెన రక్షణ గోడలు శిథిలమయ్యాయి. సరిగ్గా బైకు ప్రమాదవశాత్తూ ఈ ప్రదేశంలోనే ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కాల్వలోకి జారిపడి గల్లంతై ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదం సంభవించిన వంతెన మీదే బైకు పడి ఉంది. బైకుపై ప్రయాణిస్తున్న వారిరువురూ కాల్వలో పడి గల్లంతయ్యారు. శిథిలమైన రక్షణ గోడలను నిర్మించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదికాదని స్థానికులు వాపోతున్నారు.