క్రైమ్/లీగల్

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిప్పర్తి, ఫిబ్రవరి 18: అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన గుండెబోయిన సైదులుముదిరాజ్(34) గత 10 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..నల్లగొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. తనకున్న మూడెకరాల భూమితో పాటు ఆరెకరాలను కౌలుకు తీసుకొని పత్తి సాగు చేయగా సరైన దిగుబడి రాకపోవడంతో పంట పెట్టుబడికి తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక సైదులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఆదివారం నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ పరంగా కుటుంబానికి రావాల్సిన సహాయ సహకారాలు అందే విధంగా చూస్తానన్నారు. అదే విధంగా ఎంపీపీ పాశం రాంరెడ్డి, జడ్పీటీసీ తండు సైదులుగౌడ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, తిప్పర్తి సర్పంచ్ జాకటి మోష, ఎంపీటీసీలు అంజయ్య, వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొమరయ్య, మాజీ ఎంపీపీ మంగ మ్మ, టీఆర్‌యస్ నాయకులు గుండెబోయిన రామచంద్రు పాల్గొన్నారు.