క్రైమ్/లీగల్

ఇసుక తవ్వకాల్లో బయటపడ్డ మూడు అస్థిపంజరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ రూరల్, జూన్ 22: కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామ వాగులో 1984 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల్లో భాగంగా జిల్లాలో కురిసిన వర్షాలకు వాగు పొంగిపొర్లి వంతెనపై నుంచి నీటి ప్రవాహం వెళ్తుండగా, వంతెనపై దాటే క్రమంలో లారీతో సహా అందులోని డ్రైవర్ దౌలత్‌ఖాన్, పశువుల వ్యాపారులు ముగ్దంఖాన్, కటిక శంకర్, వెంకటస్వామి గల్లంతు కాగా, వారి అవశేషాలు శుక్రవారం చేపట్టిన ఇసుక తవ్వకాల్లో బయటపడినట్లు తహశీల్దార్ రాజ్‌కుమార్ తెలిపారు. పది రోజుల క్రితం అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తుండగా, లారీ విడి భాగాలు బయటపడటంతో గుర్తించిన గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించగా, అప్పుడు గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని తెలిపారు. ఆయా కుటుంబాల సభ్యులు ఆర్‌డివో, రూరల్ సిఐను కలిసి లారీ భాగాలు లభించిన చోట తవ్వకాలు చేపట్టాలని కోరగా. వారి సమక్షంలో తవ్వకాలు చేపట్టగా మూడు అస్థిపంజరాల అవశేషాలు బయటపడ్డాయని అన్నారు. అప్పుడు ధరించిన దుస్తులతో దౌలత్‌ఖాన్ అవశేషాలను ఆయన కుటుంబ సభ్యులు గుర్తించినట్లు చెప్పారు. మిగితా ఇద్దరి అవశేషాల గుర్తింపులో కొంత సందిగ్దత నెలకొందని, వాటిని కూడా గుర్తిస్తే అవశేషాలను అప్పగిస్తామని తెలిపారు. సేకరించిన అవశేషాలను ఇరుకుల్లలోని పద్మనాయక ఆశ్రమంలోని రూంలో బద్రపరిచామని పేర్కొన్నారు. ఇంకా అనుమానం ఉన్న మూడుచోట్ల శనివారం తవ్వకాలు చేపడుతామని రెవెన్యూ అధికారులు తెలిపారు. గల్లంతైన వారు కేశవపట్నంకు చెందిన వారని చెప్పారు.