క్రైమ్/లీగల్

బంగారు నగల దుకాణంలో చోరీ కేసులో నిందితులు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 23: పెదపూడి మండలంలోని జి మామిడాడలో ఓ బంగారు నగల దుకాణంలో జరిగిన చోరీకి గురైన 22 లక్షల బంగారు, వెండి వస్తువుల కేసులో నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. వీరిని కాకినాడలోని ఓ భవనంలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 10వ తేదీన మామిడాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర నగల దుకాణంలో ఈ చోరీ జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ తన కార్యాలయంలో వివరించారు. నర్సీపట్నంకు చెందిన తంగెళ్ళ శ్రీనివాసరావు, కాకినాడ తూరంగికి చెందిన బోనుమడతల నాగేంద్రబాబు, కాకినాడ మార్కెట్ ప్రాంతానికి చెందిన రంకిరెడ్డి రఘుప్రసాద్‌లు కలిసి దుకాణంలోని నగలను దోచేశారన్నారు. ఈ దొంగతనానికి సంబంధించి వారు ముందుగానే అక్కడ పథకాన్ని రచించినట్లు చెప్పారు. అందులో భాగంగా అక్కడ రెక్కీని నిర్వహించారన్నారు. దుకాణానికి ఉన్న ఐరన్ గ్రిల్స్, షట్టర్లకు ఉన్న 5 తాళాలను పగులగొట్టి దుకాణంలో ఉన్న రూ. 14.50 లక్షల విలువైన 500 గ్రాముల బంగారం, రూ. 8.35 లక్షల విలువ గల సుమారు 20 కిలోల వెండి ఆభరణాలను దొంగిలించుకుపోయారని ఎస్పీ చెప్పారు. దీనిలో కొంత బంగారాన్ని విక్రయించి ఆ సొమ్ముతో గత 10 రోజుల నుండి విలాసాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ దోచుకున్న సొమ్ము పంచుకునే విషయంలో వారి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయన్నారు. దీంతో అసలు విషయం బయటపడిందన్నారు. తంగెళ్ళ శ్రీనివాసరావు నూతనంగా నిర్మించుకుంటున్న గృహంలో వీరు గొడవ పడుతుండగా అసలు విషయం పోలీసులకు తెలిసిందన్నారు. శ్రీనివాసరావు ఇంటిపై కాకినాడ రూరల్ సీఐ ఎస్ రాంబాబు, పెదపూడి ఎస్సై కిషోర్‌బాబులు తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నారని ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ డిఎస్పీ రవివర్మ, ఇంద్రపాలె, కోరంగి, కరప ఎస్సైలు డి రామారావు, సుమంత్, అప్పలరాజు, పోలీస్ కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చోరీ కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీస్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.