క్రైమ్/లీగల్

కృష్ణానదిలో నలుగురు బీటెక్ విద్యార్థుల గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, జూన్ 23: కంచికచర్లలోని మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు పవిత్ర సంగమం వద్ద గల్లంతయ్యారు. సేకరించిన సమాచారం ప్రకారం కంచికచర్ల మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కాలేజీలో తరగతులు జరగకపోవటంతో శనివారం ఆట విడుపుగా ఐదుగురు విద్యార్థులు బయటకు వచ్చారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ఘాట్ వద్ద గోదావరి, కృష్ణానదులు కలిసే ప్రాంతంలో కే ప్రవీణ్, చైతన్య, రాజకుమార్, త్రినాథ్, సాయిరాం కృష్ణానదిలో స్నానం చేసేందుకు ఇక్కడ చేరుకున్నారు. ఓ విద్యార్థి నదిలోకి దిగి స్నానం చేస్తుండగా ధర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే నీరు ఉద్ధృతంగా ప్రవహించటంతో కొట్టుకుపోతుండగా మిగిలిన ముగ్గురు విద్యార్థులు అతనిని రక్షించేందుకు నీళ్లలో దిగారు. అతనిని కాపాడేందుకు ప్రయత్నంలోనే వారు కూడా నదిలో మునిగిపోయారు. నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారని గుర్తించిన ఐదవ విద్యార్థి గురజాల సాయిరాం ఎన్‌డీఏ బృందానికి సమాచారం అందించాడు. ఎన్‌డీఏ, ఫెర్రీ గజ ఈతగాళ్లు గల్లంతైన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. రాత్రి ఏడుగంటల వరకు గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు. గల్లంతైన వారిలో కడికోట్ల ప్రవీణ్ (19) గుంటూరు వద్ద దాబూరు, చైతన్య (19) మైలవరం గ్రామం, రాజకుమార్ (19) విజయవాడ పంజాసెంటర్, త్రినాథ్ (19) తిరువూరు గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. సంగమం ఘాట్ ప్రాంతానికి ఇబ్రహీంపట్నం సీఐ పవన్‌కిషోర్, డీసీపీ రాణా, విజయవాడ సబ్ కలెక్టర్‌తోపాటు తహశీల్దార్ కే శివయ్య, ఎండీఓ శ్రీనివాసరెడ్డి, గ్రామ కార్యదర్శి రాధాకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేయాలన్నారు.
మేయర్ సంతాపం
బెంజిసర్కిల్ : ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో స్నానానికి దిగి మరణించిన నలుగురి విద్యార్ధులకు నగర మేయర్ కోనేరు శ్రీ్థర్ సంతాపం తెలియజేశారు. నదిలో స్నానానికి వెళ్లి నదిలో మునిగి అకాలమంగా మరణించడడం చాలా బాధాకరమన్నారు. విద్యార్థులకు, వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని ఒక ప్రకటనలో తెలిపారు. ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.