క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 19 February 2018
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 18: జగిత్యాల మండలం పోలాస వ్యవసాయ పరిశోధన స్థానం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చిలుకమర్రి ఉపేంద్ర (27) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం ధర్మపురి నుండి జగిత్యాల వైపుకు వస్తుండగా, రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. కాగా మృతుని తండ్రి బీర్‌పూర్ పంచాయితీ కార్యదర్శిగా పని చేస్తున్న శ్రీనివాస్‌చారీ కుమారునిగా గుర్తించారు. అవివాహితుడైన ఉపేంద్ర మృతితో తల్లితండ్రులు శ్రీనివాస్, విజయలు కన్నీరుమున్నీరుగా విలపించారు.