క్రైమ్/లీగల్

కుమ్మరకొండూరులో హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిగిరి, జూన్ 23: మండలంలోని కుమ్మరకొండూరు పొలాల్లో జలదంకి మండలం కేశరంకు చెందిన గద్దె జయరామయ్య(50) గొర్రెల దొడ్డి వద్ద హత్యచేసిన సంఘటన శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాల మేరకు జలదంకి మండలం కేశవరంకు చెందిన జయరామయ్య రెండు నెలల క్రితం గొర్రెలను తోలుకుని తన చెల్లెలు ఇంట్లో వుంటున్నాడు. గొర్రెలను అక్కడే మేపుకుంటూ కాపుగర్ల మాల్యాద్రి తోటలో గొర్రెల దొడ్డి వేసుకుని అక్కడే ఉండేవాడు. శుక్రవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు జయరామయ్యపై దాడి చేసి కాళ్లు, చేతులు కట్టివేసి నోటికి గుడ్డకట్టి మంచంపై పడేసీ 68గొర్రెలను తీసుకెళ్లారు. అయితే గ్రామానికి చెందిన కాపుగర్ల చిన్నమాలకొండయ్య ఉదయం అటువైపుగా వెళ్తూ గొర్రెలు లేకపోవడం గమనించి దగ్గరికి వెళ్లి చూడగా జయరామయ్య మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో కలిగిరి, జలదంకి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. 68గొర్రెలలో 10గొర్రెలు, రెండు పొట్టేల్లు మాత్రమే కనిపించక పోగా మిగిలనవి మాత్రం క్రాకుటూరు పొలాల్లో ఉన్నట్లు గుర్తించారు.
మామూళ్ల కోసమే హత్య ?
గ్రామాలలో గొర్రెల యజమానుల నుంచి తిప్పకు చెందిన దొంగలు ఏరియాల వారీగా మామూళ్లు వసూలు చేస్తుంటారని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ కోణంలో రెండు నెలల క్రితం కేశవరంలో తిప్పకు చెందన వ్యక్తులు మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో 3వేల రూపాయలు నగదు ఇచ్చినట్లు సమాచారం. అయితే రెండు నెలల క్రితం కుమ్మర కొండూరుకు రావడంతో ఇక్కడ కూడా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా నేను అక్కడ ఇచ్చానని ఇక్కడ ఇవ్వడం కుదరని చెప్పడంతో మృతుడు జయరామయ్య, తిప్పవాసుల మధ్య వాగ్వివాదం జరిగినట్లు సమాచారం. ఈ కోణంలోనే డబ్బుల కోసం వచ్చి జయరామయ్యల మధ్య వాదన జరిగి తోపులాటలు జరిగిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, ఈ కోణంలో హత్యచేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కలిగిరి ఎస్సై చిన్న బలరామయ్య, సీఐ కె.శ్రీనివాసరావులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మృతుడు కుటుంబానికి పరామర్శ
ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు హత్య జరిగిన విషయాన్ని తెలుసుకుని సంఘటన స్థలానికి వెళ్లి మృతుడు కుటుంబాన్ని పరామర్శించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మృతుడు కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. జయరామయ్య మృతికి కారణమైన తిప్ప దొంగలను వెంటనే శిక్షించాలని బాధితులతోకలసి రాస్తారోకో నిర్వహించారు.