క్రైమ్/లీగల్

తంగెడలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల బాహాబాహీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాచేపల్లి, జూన్ 24: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే పల్నాడులో కక్షల సెగ రాజుకుంటోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో మంచినీటి వద్ద జరిగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారడంతో తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తలు మారణాయుధాలతో పరస్పరం దాడులకు దిగడంతో ఇరు పార్టీలకు చెందిన 8మంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. తంగెడ గ్రామంలో కొద్ది సంవత్సరాలుగా తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తల మద్య గ్రామానికి చెందిన అనేక అంశాలలో విభేదాలు వున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మంచినీటి ట్యాంకర్ల వద్ద ఏర్పడిన స్వల్ప వివాదం ముదిరి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. మంచినీటి సమస్యపై తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తల మధ్య స్వల్ప వివాదం జరిగింది. దీంతో ఆగ్రహించి తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై కర్రలతో దాడికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహం చెందిన వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేశారు. ఈ సంఘటనలో తెలుగుదేశం పార్టికి చెందిన కొత్తపల్లి బెంజిమెన్, దైద కిరణ్, కొత్తపల్లి భూషణం, కొత్తపల్లి మరియదాసు గాయపడగా, వైసీపీకి చెందిన కొత్తపల్లి యోహాను, కొత్తపల్లి శ్యామ్యేలు మరికొంత మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తతంగా వుండటంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఈమేరకు దాచేపల్లి ఎస్‌ఐ అద్దంకి వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.