క్రైమ్/లీగల్

ట్రాక్టర్ కింద పడి చిన్నారి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, జూన్ 24 : ప్రమాదవశాత్తు ఆదివారం ట్రాక్టర్ కింద పడి చిన్నారి సాయి అభిరామ్ (6) దుర్మరణం పాలయ్యాడు. వివరాలు ఇలా వున్నాయి. పుట్టపర్తి పట్టణంలోని పెద్దబజారుకు చెందిన రాంప్రసాద్ కుమారుడు సాయి అభిరామ్ సైకిల్ తొక్కుతూ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ కింద పడి అసువులుబాసాడు. అభిరామ్ అతని పెదనాన్న కుమారుడు పవన్‌క్రిష్ణ సైకిల్ మీద ఎక్కి రోడ్డుపై వెళుతుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ కింద అదుపుతప్పి పడిపోయాడు. ట్రాక్టర్ చక్రాలు అభిరామ్ మీద ఎక్కాయి. తీవ్ర గాయాలపాలైన అభిరామ్‌ను సత్యసాయి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచాడు. అతని సోదరుడు పవన్‌క్రిష్ణ ఈ ప్రమాదం నుండి బయటపడడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.